ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు నారా లోకేష్ ట్విట్టర్ వేధికగా రెచ్చిపోయారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ పై విమర్శలు  చేసారు. నిన్న ప్రకటించిన బడ్జెట్ లో రెండు పథకాల పేర్లు వైఎస్ జగన్ తో ఉన్నాయి. ఆ పథకాల పేర్లను అనుచిత వ్యాఖ్యలతో ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. 


ట్విట్టర్ వేధికగా నారా లోకేష్ చేసే పోస్టులను చూసి ఇప్పటికే విరక్తి చెందిన నెటిజన్లు ఫుల్ ఫైర్ అయ్యారు. ఆ ఫైర్ కి ఈరోజు నారా లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ పెడుతాడో లేదో అనేలా ఆగ్రహానికి గురయ్యారు. నెటిజన్లు అంత ఆగ్రహానికి గురయ్యేలా పెట్టిన పోస్ట్ ఇదే '.@ysjagan గారూ, పథకాలకు మీ పేర్లు తగిలించుకుని మురిసిపోతున్నారు సరే. అమ్మఒడిలో లబ్దిపొందే తల్లుల సంఖ్యను సగానికి తగ్గించడం ఏంటి? ఒక తల్లికి ఇచ్చి, ఇంకో తల్లికి ఇవ్వకుండా స్కిప్ చేసుకుంటూ, జంపింగ్ జపాంగ్ ఆటలాడతారా? పథకానికి కూడా 'జగనన్న జంపింగ్ జపాంగ్' అని పేరు పెడితే బాగుండేది'. ఇంకా ఈ పథకం అమల్లోకి రానేలేదు కానీ ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వరని అని జమీపింగ్ జపాంగ్ జగన్ అంటూ విమర్శించాడు నారా లోకేష్.  


ఈ ట్విట్ చుసిన నెటిజన్లు ఆగ్రహానికి గురయ్యారు. 'నీకు దమ్ము ఉంటె మీడియా ముందు మాట్లాడు, డైలాగ్లను అద్దెకు తీసుకోకు, నీకు రాసే అంత సీన్ లేదు. ఏమి రాసేకి, చదివేకి, మాట్లడేకి రాకపోయినా ఎగిరెగిరి పడుతున్నావ్. ఒకవేళ నీకు మాట్లాడమ్ వచ్చింటే మీడియాలు దద్దరిల్లేవి ఏమో అని వ్యాఖ్య చేశారు. మరి కొందరు ఏపీ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిన్ను జైల్లో పెట్టాలి అని వ్యాఖ్య చేశారు. మరి ఈ రిట్విట్లపై నారా లోకేష్ స్పందిస్తారు ఏమో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: