బీసీలు.. ఏపీ రాష్ట్ర జనాభాలో దాదాపు సగం ఉన్న ఈ సామాజిక వర్గాలు మొదటి నుంచి తెలుగుదేశానికి వెన్నుదన్నుగా ఉన్నారు. ఎన్టీఆర్ హయాంలో ఆయా వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ మొన్నటి ఎన్నికల్లో చివరకు బీసీలు కూడా తెలుగుదేశానికి దూరమయ్యారు.


ఇక వైసీపీ ఎన్నికల ముందు నిర్వహించిన బీసీ సదస్సు ప్లస్ పాయింట్ అయ్యింది. మొదటిసారిగా బీసీలు పెద్ద ఎత్తున వైసీపీకి ఓటు బ్యాంకుగా మారారు. దీన్ని స్థిరీకరించుకునేందుకు ఇప్పుడు వైసీపీ ప్రయత్నిస్తోంది.


ఇందులో భాగంగానే బిసిలకు చట్టసభలలో ఏభై శాతం రిజర్వేషన్ లు కల్పించాలన్న ప్రైవేటు మెంబర్ బిల్లును విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రవేశపెట్టారు.ఈ బిల్లుపై చర్చ తర్వాత విజయసాయిరెడ్డి ఓటింగ్ కు పట్టుబట్టారు. కేంద్ర మంత్రి అందుకు అంగీకరించలేదు.


దాంతో విజయసాయిరెడ్డి వాకౌట్ చేశారు. విజయసాయి బిల్లుకు పలు రాజకీయ పార్టీలు మద్దతును ప్రకటించాయి. రాజ్యసభలో బీసీల కోసం వైసీపీ చేసిన ఈ పోరాటం.. ఆయా సామాజిక వర్గాల్లో మరింత ఆదరణకు కారణమవుతుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: