అటు తిరిగి ఇటు తిరిగి చివరకు ధర్మవరం నియోజకవర్గంపై ఆధిపత్యం పరిటాల కుటుంబం చేతికే వచ్చింది.  మొన్నటి వరకూ అనంతపురం నియోజకవర్గంలోని ధర్మవరంపై సర్వహ్కకులు వరదాపురం సూరికే ఉండేది. సూరి మాజీ ఎంఎల్ఏ అయిన తర్వాత టిడిపికి రాజీనామా చేసి బిజెపిలో చేరిపోయారు. దాంతో పార్టీ పరంగా ధర్మవరం అనాధగా మారిపోయింది.

 

సూరి ఉన్నప్పటి నుండే ధర్మవరం పై పట్టుకోసం పరిటాల కుటుంబం తెగ ప్రయత్నాలు చేసింది. అయితే అప్పట్లో చంద్రబాబునాయుడుకు సూరి బాగా సన్నిహితుడు కావటంతో పాటు బలమైన క్యాడర్ ఉన్నవాడు కావటంతో పరిటాల కుటుంబం  పప్పులుడకలేదు. అయినా పరిటాల శ్రీరామ్ నియోజకవర్గంలో కాస్త హల్ చల్ చేద్దామని ప్రయత్నించినా సూరి అడ్డుకోవటంతో చేసేది లేక వెనక్కు తగ్గారు.

 

సరే ఎలాగూ సూరి ఇపుడు పార్టీలో లేరు. దానికి తోడు చంద్రబాబు కూడా మొన్న అనంతపురం జిల్లాలోని ధర్మవరం, తాడిపత్రి నియోజకవర్గాల్లో పర్యటించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గం పార్టీ ఇన్చార్జి బాధ్యలను పరిటాల కుటుంబానికే కట్టబెడుతున్నట్లు ప్రకటించారు.

 

అదే సందర్భంగా  మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ నియోజకవర్గం బాధ్యతలను ఎవరు తీసుకోవాలో తమ కుటుంబంలో చర్చించుకుని ప్రకటిస్తామని చెప్పారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం శ్రీరామ్ చేతికే ఇన్చార్జి బాధ్యతలు వస్తాయి. ఎందుకంటే ఈ నియోజకవర్గంపైన శ్రీరామ్ చాలాకాలంగా కన్నేసున్నారు. రాప్తాడు ఎలాగూ సొంత నియోజకవర్గమే కాబట్టి సునీత అక్కడే ఉంటారు. సో, వచ్చే ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ ధర్మవరం నుండి పోటీ చేయటం ఖాయమనే అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: