టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ నిన్న బెయిల్ పై బయటకు వచ్చారు. మోజో టీవీ మాజీ సీఈఓ జైల్లోకి వెళ్లారు ఈ విషయం నెటిజన్లు సోషల్ మీడియా వేధికగా కామెంట్లు చేస్తున్నారు. అలంద మీడియా ఫిర్యాదు మేరకు టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ మీద నమోదైన మూడు కేసులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 


ఇదే నేపథ్యంలో మోజో టీవీ మాజీ సీఈఓ రేవతిని పోలీసులు అరెస్ట్ చేసారు. గతంలో మోజో స్టూడియోలో ఆమె దళిత నాయకుడి ప్రసాద్ ని అవమానించిందని, అందుకు సంబంధించిన నోటీసులు పోలీసులు జారీచేసినప్పటికీ స్పందించలేదని అందుకు విచారణ నిమిత్తం ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు బంజారా హిల్స్ పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు.    


అయితే టీవీల మాజీ సీఈవోలు అరెస్ట్ అవ్వడంపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.నెటిజన్ల పెట్టిన కామెంట్లలో ఒకటి 'టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ జైలు నుంచి బెయిల్ పై ఇంటికి. మోజో టీవీ మాజీ సీఈఓ రేవతి ఇంటి నుంచి జైల్లోకి' ఒకరు లోపల మరకోరు బయట అంటూ కామెంట్ చేశారు. కాగా మోజో టీవీ మాజీ సీఈఓ రేవతి భర్త 'చైతన్య' హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే టీవీ9 రవి ప్రకాష్ బెయిల్ పై బయటకు వచ్చారు .. మోజో టీవీ మాజీ సీఈఓ రేవతికి ఎప్పుడు బెయిల్ వస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: