భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఆయన నేడు, రేపు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సాయంత్రం 5.25 గం.కు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. ఆయనకు గవర్నర్ నరసింహన్, సీఎం జగన్ స్వాగతం పలుకుతారు.


ఈ సాయంత్రం 5.45 గం.కు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి దర్శించుకుంటారు. సాయంత్రం 6.15 గం.కు శ్రీకపిలేశ్వరస్వామిని దర్శించుకుంటారు. ఈ రాత్రికి తిరుమలలోని శ్రీపద్మావతి అతిథిగృహంలో రాష్ట్రపతి బస చేస్తారు.


రేపు ఉదయం 5.40 గం.కు వరాహస్వామిని రాష్ట్రపతి దర్శించుకుంటారు. రేపు ఉదయం 6 గం.కు రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకుంటారు. రేపు మధ్యాహ్నం 3 గం.కు తిరుమల నుంచి హెలికాప్టర్‌లో శ్రీహరికోటకు రాష్ట్రపతి పయనమవుతారు. అక్కడ చంద్రయాన్-2 ప్రయోగాన్ని రాష్ట్రపతి వీక్షిస్తారు.


రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు సీఎం జగన్ నేడు తిరుపతి వెళ్లనున్నారు. సాయంత్రం రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్రపతికి సీఎం జగన్‌ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత విజయవాడ తిరిగివస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: