టీడీపీ అసెంబ్లీలో పెద్ద గొంతు వేసుకుని అరుపులు కేకలు పెడుతోంది కానీ వెనక బెంచీలు చూస్తే పూర్తిగా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తప్ప గెల్చిన 23 మందిని కూడా తనతో పాటు చంద్రబాబు కూడగట్టలేకపోతున్నారు. అసెంబ్లీలో బాబు గారు డైరెక్ట్ గా లీడ్ చేస్తున్న సహకారం అలా ఉంది మరి.


ఇదిలా ఉండగా క్రిష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇపుడు టీడీపీలో ఉన్నా ఆయన ఎక్కువ రోజులు పార్టీలో కొనసాగే అవకాశాలు అయితే  లేవని అంటున్నారు. కేవలం 838 ఓట్ల  తేడాతో గెలిచిన వంశీకి ఇపుడు భవిష్యత్తు బెంగ పట్టుకుందని అంటున్నారు. టీడీపీలో చంద్రబాబు నాయకత్వంతో పాటు లోకేష్ తీరు మీద వంశీ అసంత్రుప్తిగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.


ఇదిలా ఉండగా జగన్ తో తన గన్నవరం ప్రాంతానికి పోలవరం ఎడమ కాలువ నుంచి నీటి కోసం కోరుతూ సీఎమ్ చాంబర్లో  భేటీ అయిన వంశీ హ్యాపీ మూడ్ తో బయటకు రావడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. జగన్ వంశీల మధ్య మంచి స్నేహం ఉన్న సంగతి విధితమే. జగన్ అప్పట్లో విజయవాడ వస్తే నడి రోడ్డు మీదనే వాటేసుకుని వంశీ సంచలనం  రేకెత్తించారు.


 ఇక ఇపుడు వంశీ సైకిల్ దిగుతానంటే జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అన్న చర్చ సాగుతోంది.  మరి చూడాలి జగన్ని అసెంబ్లీలో టీడీపీ బాగా రెచ్చగొడుతోంది. చంద్రబాబు మాటమాటకూ తాను ప్రతిపక్ష నాయకుడిని అని గుర్తు చేస్తున్నారు. మరి జగన్ ఇరిటేషన్ అందరికీ తెలిసిందే. అదే శ్రుతి మించితే జగన్ సైతం గేట్లు ఎత్తేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: