ప్రతి రాష్ట్రంలో సీఎంగా పోటీ చేసే అభ్యర్థులందరూ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇస్తారు. కానీ ఆ ఇచ్చిన హామీలన్నీ సీఎంగా గెలిచిన తరువాత అమలు చేసే వారు మాత్రం చాలా తక్కువ మందే ఉంటారు. ఇచ్చిన హామీలలో చాలా హామీలకు బడ్జెట్లో కేవలం అరకొరగా నిధులు కేటాయిస్తారు. లేదా అసలు అమలు చేయకుండానే నాలుగేళ్ళ సమయం కాలయాపన చేసి చివరి సంవత్సరం మాత్రమే హామీలు అమలు చేసి ఏదో కానిచ్చేసాం  అనే విధంగా చేస్తారు.

 

కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిగారు మాత్రం అలా కాదు. 2019 ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందు నుండే ఎన్నికల్లో గెలిస్తే నవరత్నాలు అమలు చేస్తానని చెప్పాడు. గత రెండేళ్ళ పాటు నవరత్నాల్లో ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. ఎన్నికల్లో గెలిచిన తరువాత ఇచ్చిన ప్రతి హామీ అమలు జరిగేలా బడ్జెట్లో నిధులు కేటాయించాడు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరేలా బడ్జెట్ ప్రవేశపెట్టారు.

 

వైయస్సార్ ఫించన్ కానుక, వైయస్సార్ రైతు భరోసా, రైతులకు ఉచిత బోర్లు, అక్వా రైతులకు సబ్సిడీ, ఆరోగ్యశ్రీ, గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయం ఇలా ప్రజలకు ఉపయోగపడే పథకాలకు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2 లక్షల 27 వేల 984 కోట్ల బడ్జెట్ ఈసారి ప్రవేశపెట్టడం విశేషం. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని రియల్ లీడర్గా చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: