వైసీపీ ప్రభుత్వం 2 లక్షల27వేల 976 కోట్ల రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది .వైసీపీ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించిన పథకాలు సక్రమంగా అమలు చేయాలంటే కేంద్రం నుండి వచ్చే నిధులు కూడా చాలా  అవసరం. ఈ నిధులు అనుకున్న విధంగా వస్తేనే వైసీపీ ప్రభుత్వం అనుకున్న పథకాలన్నీ సక్రమంగా అమలు చేయగలదు. కేంద్రం రాష్ట్రానికి సహాయం చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ కేంద్రం సహాయం చేయకపోతేనే సమస్యలు వస్తాయి.

 

గడచిన ఆర్థిక సంవత్సరంలో టీడీపి ప్రభుత్వానికి ఊహించిన స్థాయిలో కేంద్రం నుండి నిధులు అందలేదు. బీజేపీతో నాలుగు సంవత్సరాలు మిత్రపక్షంగా ఉండి చివరి సంవత్సరంలో మోడీకి చంద్రబాబు దూరమయ్యాడు. అందువలన కేంద్రం నుండి నిధులు అరకొరగా మాత్రమే వచ్చాయి.  కానీ ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పీఎం నరేంద్ర మోడీతో మంచి సంబంధాలే కొనసాగిస్తున్నారు. నిధుల విషయంలో కేంద్రం నుండి గతంలో కంటే మెరుగ్గానే ఇప్పటిదాకా నిధులు అందాయి.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 లక్షల 62 వేల కోట్ల అప్పులు ఉన్నాయి. అప్పుల్ని వీలైనంతగా పెంచకుండానే వైసీపీ ప్రభుత్వం పథకాలు అమలు చేయాల్సి ఉంది. నరేంద్ర మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో కంటే ప్రస్తుతం నిధుల విషయంలో బాగానే ప్రాధాన్యత ఇస్తున్నారు. కేంద్రం రాష్ట్రం కోరినట్లుగా నిధులు విడుదల చేస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృధ్ధి చెందే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: