ఎప్పటినుండో మహిళా సంఘాలు, సామాజిక సంస్ధలు డిమాండ్‌ చేస్తున్న సమస్యకు ఎట్టకేలకు హైదరాబాద్‌ పోలీసులు చెక్‌ పెట్టారు.
ఇక హైదరాబాద్‌లో ' అసభ్యకర పోస్టర్లు ఎక్కడున్నా సమాచారం ఇవ్వండి పీకి పారేస్తాం ' అంటున్నారు.
ఇటీవల నగరంలో యాడ్‌ బోర్డులపై ఉన్న అసభ్యకర పోస్టర్‌ లను పోలీసు సిబ్బంది తొలగించారు. దీనికి సంబంధించి , రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ ట్వీట్‌ కూడా చేశారు.

ఉప్పల్‌ మెట్రో పిల్లర్‌ దగ్గర ఉన్న యాడ్‌ బోర్డ్‌ పై ఉన్న అసభ్యకర పోస్టర్‌ ను సిబ్బంది సహాయంతో పోలీసులు తొలగించినట్లు ఆయన తెలిపారు. సిటీలో మరెక్కడైనా ఇలాంటి పోస్టర్లను గమనిస్తే 100కు డైల్‌ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

దాంతో పాటు వాట్సప్‌ నంబర్‌ ను కూడా ఇచ్చారు. 9490617111 అనే నెంబర్‌ కు వాట్సప్‌ ద్వారా ఫిర్యాదు ఇవ్వవచ్చని చెప్పారు.
పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల, యువతరం హర్షం వ్యక్తం చేస్తోంది.

'పోస్టర్లను పీకడమే కాక, అలాంటి వాటిని అంటించిన సినిమా వారికి జరిమానా కూడా విధించాలి. అపుడే మార్పు వస్తుంది.' అని మాదాపూర్‌కి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని నీలిమ అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: