జగన్ అధికారంలోకి వచ్చి నెలరోజులైంది.  ఈ నెల రోజుల్లో అనేక పథకాలకు రూపకల్పన చేశారు.  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సిద్ధం అవుతున్నారు.  ఎలాగైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కంకణం కట్టుకున్నారు.  


ఇందులో భాగంగానే జగన్ రైతు బంధు పధకం, అమ్మఒడి వంటి వాటిని ప్రవేశపెట్టారు.  రోజుకో సంచనల నిర్ణయం తీసుకుంటూ దూసుకుపోతున్నారు.  ఇలా వరసగా పధకాలు ప్రవేశ పెడుతున్న జగన్ పాలనా తీరుపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.  


ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. జగన్ మాటలు ఆకట్టుకునేలా ఉన్నాయని, అవి మాటల వరకు మాత్రమే పరిమితం కాకుండా ఉండాలని, అప్పుడే జగన్ ప్రభుత్వానికి ప్రజల నుంచి మద్దతు వస్తుందని అన్నారు.  


జగన్ ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి కొంత సమయం ఇచ్చి చూడాలని జేసీ అంటున్నాడు.  గ్రౌండ్ స్థాయి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జగన్ ఇచ్చిన హామీలకు సంబంధించిన పధకాలు చురుగ్గా సాగడం లేదని జేసీ చెప్పుకొచ్చారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: