Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 12:15 pm IST

Menu &Sections

Search

మహిళలను వేదిస్తున్న రాబందువులు...

మహిళలను వేదిస్తున్న రాబందువులు...
మహిళలను వేదిస్తున్న రాబందువులు...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

నిర్భయావంటి చట్టాలు ఎన్ని అమలు చేస్తున్నా... బాలికలపై అత్యాచారాలు ఆగడం లేదు. పోలీసులు ఎన్ని కఠిన శిక్షలు విదిస్తున్నా.. చిన్నారులపై ఆకృత్యాలు ఆగడం లేదు. ముఖ్యంగా బంధువుల విద్యార్థులు.. మహిళలపై లైంగికదాడులకు పాల్పడుతున్నారు. గత ఏడాది రణస్థలం , మొన్న సోంపేట.. తాజాగా ఎచ్చెర్ల మండలంలో బాలికపై అత్యాచార సంఘటన వెలుగులోకి వచ్చింది. చెల్లి వరసైన బాలికపై ఓ యువకుడు కన్నేసి.. పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 


వావి వరసలు మరిచి పోయి ఈ ఆఘాయిత్యానికి పాల్పడిన ఆ యువకుడిపై కేసు నమోదయ్యింది. వివరాల్లోకి వెళ్తే .. ఎచ్చెర్ల మండలంలోని ఓ గ్రామానికి  చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక (14) పై అదే గ్రామానికి చెందిన  వాసు (26) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక పాఠశాలకు వెళ్తున్న సమయంలో వాసు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలి తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేసారు. 


ఈ ఘటనపై శ్రీకాకుళం సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.లలిత దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో బాగంగా  బాలిక చదువుతున్న జెడ్పి ఉన్నత పాఠశాల విద్యార్ధునిలతో సిఐ లలిత విచారణ చేపట్టారు. నిందితుని పై సెక్షన్ 376 ఐపీసీ 3/4 , పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు.]


భాదీతురాలను చికిత్స నిమిత్తం కిమ్స్ కు తరలించారు. మహిళల రక్షణే ద్యేయంగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు పదును పెట్టాయి. బాలికలు , మహిళలపై జరుగుతున్న ఆత్యాచారలు , వేధింపులు పుర్తిస్తాయిలో నియంత్రించేలా .. నిందితునిపై మరింత కఠినంగా వ్యవహరించేలా చట్టాలను సవరించాయి.  అయినా అత్యాచార ఘటనలు ప్రతీచోట చోటుచేసుకుంటూనే ఉన్నాయి. వీటిపై మరింత నిఘాపెట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టాల్సివుంది.



rape-victim
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.