శ్రీ‌దేవి...అతిలోక సుంద‌రి. దుబాయ్‌లో తన కుటుంబానికి చెందిన ఓ ఫంక్షన్‌కెళ్లి  గతేడాది ఫిబ్రవరి 24.. అభిమానులకు గుండెకోత మిగిల్చి దివికెగారు. అతిలొక సుందరి లేరనే వార్త తెలిసి అభిమానులు తీవ్ర దిగ్భాంతికి గురయ్యారు. బాత్ టబ్‌లో పడిపోయి మృతిచెందారని యూఏఈ అధికారులు కూడా ధ్రువీకరించారు. అయితే, శ్రీదేవీ సహజ మరణం విష‌యంలో సంచ‌ల‌న ప‌రిణామం తెర‌మీద‌కు వ‌చ్చింది. శ్రీదేవిది సహజ మరణం కాదని కేరళ పత్రిక కేరళ కౌముదిలో కేరళ జైళ్ల శాఖ డీజీ రిషిరాజ్ సింగ్ ఓ ఆర్టికల్ రాశారు. దీంతో ఈ కథనంపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగుతోంది.


దుబాయ్‌లోని ఓ హోటల్లో శ్రీదేవి ఫిబ్రవరి 24, 2018న ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో మునిగి చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అతిలోక సుందరి మరణంపై ఇప్పటికీ ఎన్నో అనుమానాలున్నాయి. అయితే పోస్ట్‌మార్టమ్ నివేదిక మాత్రం ఆమెది సహజమరణమేనని తేల్చింది. అయితే దీనిపైనే రిషిరాజ్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. ఆమె ప్రమాదవశాత్తూ బాత్ టబ్‌లో పడిపోయి ఉండకపోవచ్చనే అభిప్రాయపడ్డారు. అయితే తన ఫ్రెండ్.. ఫోరెన్సిక్ నిపుణుడైన ఉమదతన్‌తో ఇదే విషయాన్ని చర్చించినప్పుడు ఆయనకూడా తన అభిప్రాయంతోనే ఏకీభవించారని సింగ్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఈ విషయంలో మాట్లాడేందుకు తన మిత్రుడు జీవించిలేరని కూడా తెలిపారు. తాజాగా రిషిరాజ్ సింగ్ లేవనెత్తిన అనుమానాలతో మరోసారి శ్రీదేవి మరణంపై సందేహాలు నెలకొనే పరిస్థితి వచ్చింది.


అయితే ఆ పోలీస్ అధికారి చేసిన ఆరోపణలను శ్రీదేవి భర్త బోనికపూర్ తోసిపుచ్చారు. సత్యదూరమైన అంశాలను ప్రస్తావించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని సూచించారు. ఊహలలోకంలో విహరిస్తూ .. కట్టుకథలు అల్లితే విశ్వాసం ఉంటుందా అని ప్రశ్నించారు. ఆయనే కాదు తన స్నేహితుడి ప్రస్తావిస్తూ కాలమ్‌లో కట్టుకథ అల్లడం సరికాదన్నారు. ఇలాంటి పిచ్చిపనులపై తాను స్పందించబోనని బోనికపూర్ స్పష్టంచేశారు .


మరింత సమాచారం తెలుసుకోండి: