ఇది జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్ ముఠాల కార్యాకలాపం. క్రికేట్ బెట్టింగ్ ని అరికట్టడానికి ఎన్ని  చర్యలు తీసుకుంటున్న క్రికెట్ బెట్టింగ్ ముఠాలు పుట్టుకొస్తునే ఉన్నాయి. తాజాగా రాజాంలో కిక్కెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయింది. క్రికేట్ ప్రపంచ కప్ పురస్కరించుకొని బెట్టింగ్ రాయుళ్ల నిర్వహిస్తున్న కార్యకలాపాలపై సమాచారం పోలీసులకు అందడంతో ఆ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఎస్పీ అమ్మిరెడ్డి మాట్లాడుతూ రాజం బాబానగర్ లో మొదటి లైవ్ లో కొంత మంది సభ్యులు ముఠాగా ఏర్పడి ఓ ఇంట్లో కార్యకలాపాలను ప్రారంభించారని ఆయన తెలిపారు.  ప్రపంచ కప్ సెమీఫైనల్ ల్లో ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా జట్టుపై తలపడ్డారు. 

ఏ బాల్ కు ఎన్ని రన్లు చేస్తారు.. ఫైనల్ కు వెళ్లే జట్టు ఏది.. సెమీఫైనల్ లో ఫలానా జట్టు  గెలుస్తుందని కొందరు.. ఓడి పోతుందని కొందరు.. ఇలా వేలాది రూపాయలు బెట్టింగ్ కాశారు. దర్జాగా బుకీలు ఇంట్లోనే తతంగం నడిపి బెట్టింగ్ లో పాల్గొనేందుకు వచ్చినవారి వద్ద నుంచి భారీగా డబ్బులు , చెక్ లు తీసుకోని నిర్వహించారు. అయితే ఈ సమాచారం పోలీసులకు చేరడంతో గురువారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో బాబానగరలోని ఓ ఇంటిపై పోలీసులు దాడులుచేశారు. దీంతో బెట్టింగ్ రాయుళ్ల నుంచి రూ.2,65,000 నగదును , 12 సెల్ ఫోన్లను అదుపోకి తీసుకొని , బెట్టింగ్ ఎంత కాస్తున్నది నమోదు చేసుకున్నారు.

బెట్టింగ్ రాయుళ్ల నుంచి నోట్ పుస్తకాలను కూడా పోలీసులు స్వాధినం చేసుకున్నారు. పట్టుపడ్డ నగదును, సెల్ ఫోన్లను జిల్లా పోలీస్ స్టేషన్ కు తరలించారు. పట్టుబడ్డ నిందితుల్లో లావేరు మండలంలోని బెజ్జిపురం ప్రాంతానికి చెందిన పిన్నింటి శివకుమార్ , సంత కవిటి మండలంలోని పొనుగూటి వలస గ్రామానికి చెందిన శేషపు మురళీకృష్ణ , రేగడి ఆమదాలవలస మండలంలోని పెద్దశిథిలం ప్రాంతానికి చెందిన లంక దామోదర రావు , రాజాం మండలంలోని గడ్డిముడిదం గ్రామానికి చెందిన చింత  శ్రీనివాస రావు. అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడుతున్నామని ఎస్పీ వివరించారు. పరారీలో ఉన్న మరో ఐదుగురిని కూడా పెట్టుకొనేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని  ఎస్పీ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: