ఏపీలో టీడీపీ ఖాళీ అయిపోతుంది.. గత నెల రోజులుగా రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తున్నమాట ఇది. ఇందుకు అనుగుణంగానే టీడీపీ ఎంపీలు నలుగురు బీజేపీలోకి జంప్ చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా అడపా దడపా టీడీపీ నుంచి బీజేపీలోకి వస్తూనే ఉన్నారు.


కానీ బీజేపీ నేతలు చెప్పిన స్థాయిలో ఈ వలసలు లేవన్నమాట నిజం. కారణం ఏదైనా టీడీపీ నుంచి బీజేపీలోకి వలసల జోరు ఊహించిన దానికన్నా బాగా తగ్గింది. అయితే ఇందుకు కారణం ఉందట. ఈ చేరికలపై ఇండా ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదట.


ఆ గ్రీన్ సిగ్నల్ వస్తే ఏపీలో టీడీపీ ఖాళీ అయిపోతుందట. ఈమాటలు అంటున్నది ఎవరో కాదు.. బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు. 2024లో ఏపీలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తున్నామని ఆయన అన్నారు. హైమాండ్ ఆదేశాల కోసం వేచి చూస్తున్నామని... ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఏపీలో టీడీపీ ఖాళీ అయిపోతుందని అంటున్నారు.


బీజేపీలో చేరేందుకు టీడీపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. మరి ఇంతకూ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు ఎందుకు వెనుకాడుతుందో మాత్రం చెప్పడం లేదు ఈ మాజీ మంత్రిగారు.


మరింత సమాచారం తెలుసుకోండి: