క్రికెట్ దిగ్గజం, జార్ఖండ్ డైనమైట్  ఎంఎస్ ధోని  తొందరలో రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారు.  ఈ ఏడాది చివరలో జరగబోయే జార్ఖండ్డ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా రంగంలోకి దిగే అవకాశాలున్నట్లు సమాచారం. అంటే జనాల్లో ధోనికున్న పాపులారిటిని బిజెపి ఫుల్లుగా వాడేసుకోవాలని డిసైడ్ అయినట్లు అర్ధమైపోతోంది.

 

ప్రపంచకప్ లో అనూహ్య విజయం తర్వాత భారత జట్టు దేశానికి వచ్చేస్తోంది. ఆగస్టులో జరగబోయే వెస్టిండీస్ పర్యటనలో ధోని ఆడే అవకాశం తక్కువే అంటున్నారు. తొందరలో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఎక్కువున్న నేపధ్యంలోనే రాజకీయ ప్రవేశంపై ప్రచారం పెరిగిపోతోంది.

 

క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాతే ధోని బిజెపిలో చేరుతారంటూ బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి సంజయ్ పాస్వాన్ ప్రకటించటం గమనార్హం. ధోనితో తనకు సన్నిహితమున్నట్లు పాస్వాన్ చెప్పుకుంటున్నారు. క్రికెట్ టీమ్ నుండి తప్పుకున్న తర్వాత నరేంద్రమోడి జట్టులో చేరి ఆటమొదలుపెడతారంటూ పాస్వాన్ చెప్పటం ప్రచారాన్ని పెంచేస్తోంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: