గత కొంతకాలంగా అధికార పక్షమైన వైసీపీ పార్టీపై ట్విట్టర్ ద్వారా విమర్శలు చేస్తున్న నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ పై జగన్ గారూ! మీ బడ్జెట్ కేటాయింపులే నామమాత్రమా? మీ హామీలు కూడా నామమాత్రమా? చూస్తుంటే మీరు నామమాత్రపు  ముఖ్యమంత్రిలా కనిపిస్తున్నారు. రైతులకు వడ్డీలేని రుణాలకు 3500 కోట్లు ఎందుకు కేటాయించలేదు అని ప్రశ్నించాడు.

 

రైతుల వడ్డీలేని రుణాల కోసం 3500 కోట్ల రుపాయలు ఇస్తామని జగన్ గారు తన సొంత జిల్లాలో తమ తండ్రి గారి పేరున రైతు దినోత్సవం జరుపుతూ అన్నారు. తీరా బడ్జెట్లో 100 కొట్లు మాత్రమే కేటాయించారేంటి అని ట్వీట్ చేసాడు నారా లోకేశ్.జగన్ పేరుతో ప్రారంభమైన పథకాల గురించి  జగన్ గారు, పథకాలకు మీ పేర్లు తగిలించుకుని మురిసిపోతున్నారు. అమ్మఒడిలో లబ్డిపొందే తల్లుల సంఖ్య సగానికి తగ్గించారు ఎందుకు అని ప్రశ్నించాడు లోకేశ్.

 

ఐదేళ్ళలో 25 లక్షల ఇళ్ళు కడతామన్నారు. పైగా గృహ రుణాలన్నీ రద్దు చేస్తామన్నరు. బడ్జెట్ చూస్తే కేవలం 8,615 కోట్లు మాత్రమే ఇచ్చారు. మీరు నిర్మిస్తామన్నది పిచ్చుక గూళ్ళు కాదు కదా అన్న నారాలోకేశ్ ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పై కూడా కామెంట్లు చేసాడు. ఆర్థిక మంత్రి గారు రామాయణమంతా చదివారు. సంజీవని గురించి చెప్పారు. ఆరోగ్యశ్రీకి కేవలం 1740కోట్లు మాత్రమే ఇచ్చారు అని విమర్శించాడు నారా లోకేశ్.


మరింత సమాచారం తెలుసుకోండి: