లక్ అంటే కిషన్ రెడ్డిదే అని చెప్పాలి.  కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయినా నాలుగు నెలలు తిరక్కముందే.. సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించాడు.  విజయం సాధించడమే కాదు.. ఏకంగా ఆయనకు కేంద్ర మంత్రి పదవి లభించింది.  


మొదటిసారిగా ఎంపీగా ఎంపికైనా భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయాలనే లక్ష్యంతో ఉన్నది కాబట్టి కిషన్ రెడ్డికి మంత్రి పదవిని ఇచ్చింది.  కేంద్ర హోమ్ శాఖా సహాయమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.  మంత్రి పదవి తీసుకున్నాక కిషన్ రెడ్డి తెలంగాణాపై దృష్టి పెట్టారు.  


అక్కడ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.  ఇదిలా ఉంటె, కిషన్ రెడ్డి ప్రైవేట్ సెక్రటరీగా ఆమ్రపాలిని నియమిస్తున్నట్టు కేంద్రం ఉత్తర్వులు జారే చేసింది.  ప్రస్తుతం ఆమ్రపాలి కెసిఆర్ పేషీలో పనిచేస్తున్నది.  కెసిఆర్ పేషీలో అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమ్రపాలిని కేంద్రం బదిలీ చేయడంతో కెసిఆర్ షాక్ అయ్యారు.  


ఈ బదిలీపై కెసిఆర్ ప్రభుత్వం నో అబ్జెక్షన్ సెర్టిఫికెట్ ఇవ్వాలి.  ప్రస్తుతం ఆమ్రపాలి విషయం కెసిఆర్ కోర్టులో ఉన్నది.  బదిలీ చేసేందుకు ఇష్టం లేదు అని ప్రభుత్వం చెప్పలేదు. ఎందుకంటే సివిల్ సర్వీస్ ఉద్యోగుల వ్యవహారం కేంద్రం చేతుల్లో ఉంటుంది.  మరి కిషన్ రెడ్డి కోసం కెసిఆర్ త్యాగం చేస్తారా .. చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: