జిల్లా అభివృద్ధితో ముడిపడి ఉన్న 'వంశధార' ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన ప్రాజెక్టుగా ప్రకటించింది. రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్  జిల్లాలో ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసింది. ఈ ప్రాజెక్టు లక్ష మందికి లబ్ది కల్పించనుంది. రైతుల వాటా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించేందుకు మొగ్గు చూపడంతో రూ.50 కోట్ల మేరకు ఆదా అవుతుంది. జగనన్న 'అమ్మబడి' తో  జిల్లాలో మూడు లక్షల మందికి పైగా తల్లులకు ప్రయోజనం చేకూర్చనుంది. రూ.450 కోట్లలకు పైగా లబ్ది చేకూరనుంది. 'వైఎస్సార్ రైతు భరోసా' కింద 5.25 లక్షల మంది రైతులకు ఏటా దాదాపు రూ.650 కోట్ల పైగా పెట్టుబడి రాయితీ కింద అందనుంది.

జిల్లాలో 2.47 ఎకరాల లోపు రైతులు 4,37,437 మంది కాగా..స్మాల్ ఫార్మర్స్ పరిధిలో 2.47 నుంచి 4.93 ఎకరాలలోపు రైతులు 70,894 మంది ఉన్నారు. సెమి మీడియం ఫార్మర్స్ పరిధిలో 4.94 ఎకరాల నుంచి 9.87 ఎకరాలలోపు రైతులు మరో 21,851 మంది ఉన్నారు. వీరితో పాటు మీడియం ఫార్మర్స్ కేటగిరి కింద 9.88 ఎకరాల నుంచి 14.7 ఎకరాలు లోపు రైతులు 5,243 మంది ఉన్నారు. ఈ లెక్కన ప్రతీ ఏటా దాదాపు రూ.650 కోట్లు పైగా జిల్లా రైతులకు లబ్ది చేకూరనుంది.

సాగునీటి  ప్రాజెక్టులకు చేసిన కేటాయింపుల్లో ప్రాజెక్టులకు ఎంతెంత కేటాయించిందీ  తెలియలేదు. జిల్లాల్లోని పర్యవేక్షణ ఇంజినీర్ అధికారులతో నిర్వహించిన దృశ్యశ్రవణ సమావేశంలో కూడా వెల్లడించలేదు. ప్రస్తుతం జిల్లాలోని 'వంశధార' ప్రాజెక్టు ఎస్.ఈ సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది కనీసం రూ.100 కోట్ల మేరకు నిధులు కేటాయించాలని కోరారు. ఇంతకు  ముందు వరకు చేసిన పనులకు చెల్లించవలసిన బకాయిలు రూ.170 కోట్ల వరకు ఉన్నాయని , జిల్లాలో ఇతరత్ర ప్రోజెక్టులన్నింటికి కలిపి రూ.200 కోట్లు మేరకు అవసరం ఉంటుందని ప్రభుత్వానికి ఎస్.ఈ నివేదికనిచ్చారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: