కమెడియన్ అలీ 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారని అందరూ భావించారు. ఎంపీ టికెట్ కోసం మొదట అలీ చంద్రబాబుని, ఆ తర్వాత పవన్ కల్యాణ్ ను తర్వాత జగన్మోహన్ రెడ్డిగారిని కూడా కలిసారు. కానీ అలీ టీడీపీ పార్టీలో, జనసేన పార్టీలో చేరకుండా చివరకు వైసీపీలో చేరాడు. జగన్మోహన్ రెడ్డిగారు ఎంపీ టికెట్ ఇవ్వనని చెప్పినప్పటికీ వైసీపీలో చేరి వైసీపీ తరపున ప్రచారం చేసాడు అలీ. వైసీపీ పార్టీ విజయం కోసం చాలా ప్రాంతాలలో తిరిగి ప్రచారం చేసాడు. 
 
అలీ పార్టీ కోసం చేసిన సేవలకు గాను జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అధికారికంగా వైసీపీ తరపున దీని గురించి సమాచారం అందాల్సి ఉంది. నిజానికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గారికి అలీ చాలా సన్నిహితుడు. అలీ జనసేన పార్టీలో చేరి ఉంటే పవన్ కల్యాణ్ ఎంపీగా పోటీ కూడా చేయించేవారు. ఐనా కూడా అలీ వైసీపీలో చేరటానికే మొగ్గు చూపాడు. 
 
సినీ ఇండస్ట్రీ నుండి అలీ, థర్టీ ఇయర్స్ పృథ్వీ, మోహన్ బాబు, జయసుధ వైసీపీకు మద్దతు ఇచ్చారు. థర్టీ ఇయర్స్ పృథ్వీ కూడా వైసీపీ విజయం కోసం చాలానే కష్టపడ్డాడు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ విజయం కోసం కష్టపడిన వారికి పదవులు ఇవ్వటం వలన వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అలీకి ఎమ్మెల్సీ పదవి వస్తే పార్టీ కోసం కష్టపడిన ఇతర సినీ ప్రముఖులకు కూడా ఏదో ఒక పదవి వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: