త‌న‌ను న‌మ్ముకున్న వాళ్ల‌కు ఎలా న్యాయం చేస్తారో మ‌రోమారు వైసీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నిరూపించారు.విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్‌గా వైసీపీ సీనియర్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్‌ను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ద్రోణంరాజు ఈ ఏడాది మార్చిలో ఎన్నిక‌ల ముందు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.



కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే అయిన ద్రోణంరాజు శ్రీనివాస్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకొన్నారు. అనంతరం ద్రోణంరాజు శ్రీనివాస్‌ మాట్లాడుతూ...ఏపీలో కాంగ్రెస్ పార్టీ అస్థిత్వం కోల్పోయిందని ద్రోణంరాజు శ్రీనివాస్ పేర్కొన్నారు.  వైఎస్‌ జగన్ నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేస్తామని తెలిపారు. 


విశాఖకు చెందిన శ్రీనివాస్‌ తొలుత కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా పనిచేశారు. ద్రోణంరాజు శ్రీనివాస్ గెలుపు వెనుక‌ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌స్తం ఉంది. అంతేకాకుండా ద్రోణం రాజుకు వైఎస్ కుటుంబంలో ఇప్పటికీ మంచి సంబంధాలే ఉన్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్ఇన‌క‌ల్లో విశాఖ సౌత్‌లో టీడీపీ అభ్య‌ర్ధి వాసుప‌ల్లి గ‌ణేష్ కుమార్‌కు బ‌ల‌మైన పోటీగా, బ్రాహ్మ‌ణుల సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉండ‌డంతో, అదే సామాజిక‌వ‌ర్గం నుండి బ‌రిలో దింపేందుకు ద్రోణంరాజుకు అవ‌కాశం క‌ల్పించారు. అయితే, ద్రోణంరాజు టిడిపి అభ్యర్థి గణేశ్‌ కుమార్‌ చేతిలో ఓడిపోయారు. తాజాగా ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: