ఒక కిలో యార్సాగుంబా ధర విదేశాల్లో రూ.60 లక్షల(లక్ష డాలర్ల) పైమాటే. గ్రామీణ నేపాల్‌లో ఉపాధి అవకాశాలు తక్కువ కావడంతో మెజారిటీ కుటుంబాలు దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. ఇప్పుడు దీనికి ఉన్న డిమాండ్ ఎంత ఎక్కువంటే... బంగారం కంటే అదే రేటెక్కువ.  చాలా విలువైన మూలికలు కావడంతో వీటి కోసం ప్రాణాలకు తెగించి మరీ ఈ కుటుంబాలు పోరాడుతున్నాయి. యార్సాగుంబా  అంటే హిమాలయన్‌ వయాగ్రా. పసుపు పచ్చ రంగులో ఉండే యార్సాగుంబా బురదలో పెరుగుతుంది. లైంగిక కోరికలను రేకెత్తించడం తోపాటు పుష్కలమైన ఔషధ గుణాలున్న మూలిక.


గొంగళిపురుగు లాంటి ఓ పురుగు లార్వా తలపై పుట్టగొడుగుల మాదిరిగా పెరిగే ఫంగస్సే ఈ యార్సాగుంబా. చైనాలో డాంగ్‌ ఛాంగ్‌ జియా కావో అనే రెండు తలల పురుగు ఉంటుంది. దీనిని వేసవి గడ్డి, చలికాలపు పురుగు అంటారు. ఈ మొక్కల్ని సేకరించే నేపాలీ ప్రజలు వాటిని ఎండబెడుతున్నారు.

అలా ఎండిన యర్సాగుంబాను తిన్నా, దాన్ని పొడిచేసుకొని తిన్నా, దాన్ని వంటల్లో వేసుకొని తిన్నా సెక్స్ సామర్ధ్యం బోల్డంత పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. ఆన్‌లైన్‌లో దొరుగుతున్న ఈ యర్సాగుంబా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండకపోవడం విశేషం.  శీతాకాలంలో యార్సాగుంబా పురుగులా ఉంటే.. వేసవి వచ్చేసరికి ఫంగస్‌ కారణంగా చిన్న మొక్క మాదిరిగా మారిపోతుంది. పూర్తిగా తయారైన యార్సాగుంబా ఒక అగ్గిపుల్ల మాదిరిగా.. రెండు నుంచి మూడు సెంటీమీటర్ల పొడుగు ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: