ఈ మద్య కాలంలో మనిషి మహా అంటే 60 ఏళ్లు బతకడం చాలా కష్టమని వైద్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.  ఆరోగ్యం గురించి కాస్త శ్రద్ద వహించి..తినే ఆహారంలో సరైన నియమాలు పాటిస్తే మహా అంటే కొంత కాలం ఎక్కువ బతకవొచ్చని చెబుతున్నారు.  ఒకప్పుడు మనిషి నిండా నూరేళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించేవారు..ఇప్పటికీ గ్రామాల్లో చాలా మంది వయసు మీదపడిన వారు ఇంకా హుషారుగానే కనిపిస్తుంటారు. దానికి కారణం ఆ కాలంలో వారు తినే తిండిలో పోషక విలువలు ఉండేది. 

ఇప్పుడున్న కాలుష్యం,ఆయిల్ ఫుడ్స్, ఏ చిన్న వ్యాది వచ్చిన పుట్టెడు యాంటీబయటిక్ మందులు ఇలా ఒక్కటేమిటి మనిషి ఆయురార్థం తగ్గించుకోవడానికి ఎన్నో వాడుతున్నాం.  సరైన తిండి, గాలి చివరికి నీరు కూడా కరువే.  అలాంటిది ఒక తాత ఎంతో హుషారుగా కుస్తీ పోటీల్లో పాల్గొని అందరికీ షాక్ ఇచ్చాడు.  మదురైలోని పళంగనాథమ్‌లో తన అఖడాలో పళని కుస్తీ పోటీలు నేర్పిస్తున్నాడు.

తాను 1944లో తాను ఇక్కడ కుస్తీ పోటీలు నేర్పడం ప్రారంభించానని ఆయన చెప్పారు. ఫిట్‌నెస్‌ కోసం తాను కూడా కుస్తీ పడుతుంటానని ఆయన అన్నారు. తద్వారా తన విద్యార్థులను చైతన్యపరుస్తుంటానని ఆయన చెప్పారు. ఏదేమైనా ఈ వయసులో కూడా ఇంత హుషారుగా కుస్తీలు పడుతున్న ఈ తాతకు ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే అంటున్నారు నెటిజన్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: