పర్యవరణ పరిరక్షణ అందరి భాద్యతని ఇందుకు ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని కలెక్టర్ నివాస్ పిలుపునిచ్చారు. కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ  శ్రీకాకుళం జిల్లాలో  విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్  ఆవరణంలో ట్రాఫిక్ డిఎస్పీ సిహెచ్ జివి ప్రసాదరావు నిర్వహించిన "వనం-మనం" కార్యాక్రమాన్ని కలెక్టర్ నివాస్ , ఎస్పీ అమ్మిరెడ్డి  ముఖ్య అతిదులుగా హాజరై ప్రారాంభించారు. 

ఈ సందర్బంగా ఎస్పీ అమ్మిరెడ్డి  మాట్లాడుతూ.. "వనం-మనం" కార్యక్రమంలో భాగంగా పోలీసులు తరపున మూడు సబ్ డివిజన్ లలో సుమారు
లక్ష మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇప్పటికే 20 వేల మొక్కలను నాటినట్టు పేర్కొన్నారు. ఎచ్చర్ల పోలీస్ క్వార్టస్ లో  వెయ్యి మొక్కలను నాటే కార్యక్రం జరుగుతుందని వివరించారు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో కూడా మొక్కలు నాటుతున్నామన్నారు.  రానున్న 15 రోజుల్లో మిగిలిన మిగిలిన మొక్కలను నాటుతామని ఆయన అన్నారు.

 శ్రీకాకుళం ట్రాఫిక్  పోలీస్ స్టేషన్ లో ప్రతీ కానిస్టేబుల్ కి పది మొక్కలు చొప్పున ఇస్తామని ... వాటిని వారే పరిరక్షించాలన్నారు. కార్య క్రమానికి పాత శ్రీకాకుళం డిసిసిబి నుంచి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వరకు పోలీసులు , విద్యార్థులు , ఆటో డ్రైవర్ల తో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిసిఎస్ డిఎస్పీ సత్యనారాయణ , పలువురు ఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: