టీడీపీ మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి ఏది చెప్పాలనుకున్న ముక్కుసూటిగా చెబుతారు. అయితే ఇప్పుడు తాజాగా వైసీపీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కొత్త ప్ర‌భుత్వం కొలువు దీరింది. అఖండ మెజారిటీతో వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. వైసీపీ అధినేత జ‌గ‌న్ సీఎం అయ్యారు. ప్ర‌తి శాఖ‌లోనూ ప్ర‌క్షాళ‌న చేస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్‌.. ఎక్కడిక‌క్కడ విచ్చ‌ల‌విడిగా పేట్రేగి పోతున్న లంచావాతురుల్ని క‌ట్ట‌డి చేస్తాన‌ని చెప్పారు. త‌న పార్టీ అయినా స‌రే.. మ‌రిం త క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని చెప్పారు. 


ఈ నేప‌థ్యంలో అటు కాంట్రాక్ట‌ర్ల నుంచి ఇటు, కొన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల నుంచి వ‌చ్చే లంచాలు, క‌మీష‌న్ల‌కు ప్ర‌భుత్వం పూర్తి గా అడ్డుక‌ట్ట వేసింది. అయిన‌ప్ప‌టికీ.. ఇటీవ‌ల ప్ర‌కాశం జిల్లాలో ఒక ఎమ్మెల్యే పోలీసు అధికారి బ‌దిలీ విష‌యంలో జోక్యం చేసుకుని రూ.10 ల‌క్ష‌లు తీసుకున్న‌ట్టు వార్త‌లు రావ‌డంతో జ‌గ‌న్ వెంట‌నే స్పందించారు. వెంట‌నే దీనిపై విచార‌ణ చేపట్టి.. ఆ మొత్తాన్ని.. సంబంధిత అధికారికి తిరిగి అప్ప‌గించేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. 


అయితే.,. తాజాగా జ‌గ‌న్ పాల‌న‌పై స్పందించ‌న‌ని చెబుతూనే స్పందించిన అనంత‌పురం మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి రాష్ట్రంలో అవినీతి చేసేందుకు వైసీపీ నాయ‌కులు ఆవురావురు మంటున్నార‌ని వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ ను చూసి భ‌య‌ప‌డుతున్నార‌ని లేక పోతే.. అంతే సంగ‌తులని, అప్పటికే నెల రోజులు గడిచిపోయాయ‌ని నాయ‌కులు తెగ బాధ‌ప‌డిపోతున్నార‌ని అంటున్నారు. వాస్త‌వానికి జేసీ చెప్పిన‌ట్టు ప‌రిస్థితి ఏమీలేద‌ని అంటున్నారు త‌ట‌స్థులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: