"స్పందన" వినతుల నమోదు విషయంలో కంప్యూటర్ ఆపరేటర్లు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జె.నివాస్ అన్నారు. సకాలంలో సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా శాఖా వారీగా దరఖాస్తులను సిద్ధం చేయాలని అన్నారు. "స్పందన" కార్యక్రమం నిర్వహణపై జడ్పి సమావేశ మందిరంలో వివిధ శాఖల కంప్యూటర్ ఆపరేటర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ "స్పందన" కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అర్జీలకు రశీదు ఇవ్వాలని.. ఎన్ని రోజుల్లో సమస్య పరిష్కారం కానుందో రాత పూర్వకంగా తెలియజేయాలన్నారు. "స్పందన" డేటా ఎంట్రీలో తప్పిదాలు జరగరాదని హెచ్చరించారు. భూమి, సామాజిక, పౌరసరఫరాలు, రేషన్, పింఛన్ , గృహ సంబంధిత సమస్యలకు ప్రత్యేక గుర్తింపు (ఐడి) సంఖ్య ఇవ్వాలన్నారు. ఐడి నెంబర్ ఇచ్చి సెర్ఫ్ కు పంపించాలని ఆదేశించారు.
రేషన్ కార్డుల ధరకాస్తులు "స్పందన"లోనే రావాలన్నారు. నేరుగా ముఖ్య మంత్రి కార్యాలయం నుంచి నాలుగు విభాగాలుగా దరఖాస్తులు వస్తాయని వివరించారు. ఏ.ఎం.ఎస్ , "స్పందన" , సీఎంవో కాల్ సెంటర్ , సీఎం దర్బార్ నుంచి  సమాచారాన్ని రోజు పరిశీలించి సంబంధిత అధికారులకు తెలియజేయాలని ఆదేశించారు. వీటిని పెండింగ్ పెడితే చర్యలు తప్పవని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: