ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సీఎం జగన్ జమానా నడుస్తుందని అంటున్నారు.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే.  ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తున్నారు.  తాను ఇచ్చిన నవరత్నాల హామీకి కృషి చేస్తున్నాడు.  గత పాలకుల నీడలో అక్రక మట్టడాలు ఎన్నో వెలిశాయని..వాటన్నింటిని కూల్చే పనిలో ఉన్నారు. 

ప్రకృతి పర్యావరణానికి ఇబ్బంది కలిగించే ఏ విషయాన్ని కూడా వదిలే ప్రసక్తి లేదని అంటున్నారు సీఎం జగన్.  ఇక సీఎం జగన్ కి అత్యంత ఆప్తుడు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఇటీవల ట్విట్టర్ వేధికగా చేసుకొని ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి పూర్తిస్థాయిలో తాడేపల్లికి తరలించబోతున్నట్లు  విజయసాయిరెడ్డి  తెలిపారు. 

గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో ఈరోజు వైసీపీ ప్రధాన కార్యాలయం పనులను ఆయన పర్యవేక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..‘మరో 10 రోజుల్లో వైసీపీ ప్రధాన కార్యాలయం తాడేపల్లిలో అందుబాటులోకి వస్తుంది.  ఇకపై పార్టీ కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే జరుగుతాయని అన్నారు. ప్రజలకు మంచి పరిపాలన అందించడం, నవరత్నాల ద్వారా ప్రతీపౌరుడికి లబ్ధిచేకూర్చే దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకు వెళుతోందని స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: