తిరుపతి అంటే ఎవ్వరికైనా వెంకన్న తర్వాత గుర్తుకు వచ్చేది స్వామి వారి ప్రసాదం లడ్డు.  కొంత మంది తిరుపతి లడ్డూ కోసం ఎన్నిబాధలైనా పడుతుంటారు.  తిరుపతి వెళ్లిన వారికి తప్పకుండా తమకు కూడా ఒక లడ్డూ తీసుకు రమ్మని చెబుతుంటారు.  ఆ లడ్డూకి ఉన్న ప్రాశస్త్యం అలాంటిది. అయితే పెద్ద మొత్తంలో ప్రసాదం తయారీ కారణంగా నెయ్యి కూడా పెద్ద మొత్తంలోనే వాడుతుంటారు.

ఇదే సమయంలో అప్పుడప్పుడు అక్కడ కొన్ని  అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి.  ప్రతిసారి ఇలా జరగడంతో అధికారులపై తీవ్ర వత్తిడి రావడం మొదలైంది..దాంతో టీటీడీ బూందీ పోటు ఆధునికీకరణకు నడుం బిగించింది. దీనికోసం థెర్మో ఫ్లూయిడ్ ద్వారా నడిచే స్టౌవ్‌లను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

దీని ప్రత్యేకత ఏంటంటే.. ఈ స్టౌవ్‌ల ద్వారా మంటలు వెలుపలికి వచ్చే అవకాశం లేదు. వేడి కూడా బయటకు రాదు. దీంతో సిబ్బందికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని టీటీడీ అధికారులు థెర్మో ఫ్లూయిడ్ స్టౌవ్‌లను పరిశీలిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: