కర్ణాటకలో రాజకీయాలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి,కంచుకోటలాగా ఉండే జేడీస్ ప్రభుత్వం పేకమేడలా కూలిపోయే స్థితికి చేరుకుంది. విపత్కర పరిస్థితుల మధ్య ఎవరు ఊహించని విధంగా ముఖ్యమంద్రి పదవిని పొందిన కుమారస్వామి పదవి మూడు నాళ్ళ ముచ్చటగా,దిన దిన గండంగా మారింది.
కాంగ్రెస్-జేడీస్ సంకీర్ణ ప్రభుత్వానికి షాక్ తగిలింది, కర్ణాటక సీఎం కుమార స్వామి అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు సంకీర్ణ ప్రభుత్వానికి బీటలు వారే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్-జేడీస్ కి సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా సమర్పించారు,వాస్తవానికి 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సి ఉంది అదే జరిగితే,ఆ రాజీనామాలు ఆమోదం పొందితే కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిపోయేది.


అయితే కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ మంత్రి పీకే శివకుమార్ హుటాహుటిన రంగ ప్రవేశం చేసి ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మనసు మారేలా చేశారు.సంకీర్ణ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ను చేపట్టిందని ఆరోపించారు మంత్రి శివ కుమార్.కాంగ్రెస్ అసంతృప్తి ఎమ్మెల్యేలు అయిన రామలింగారెడ్డి, సోమశేఖర్,బస్వరాజ్ ను బుజ్జగించి రాజీనామాలు సమర్పించకుండా నిలవరించారు.


మంత్రి శివకుమార్ ఇంకా కొంత మంది రెబల్స్ తో సంప్రదింపులు జరుపుతున్నారు,శివకుమార్ బుజ్జగింపులు ఫలించి కొంత మంది ఎమ్మెల్యేలు వెనక్కి వస్తున్నారు.ఇప్పటికే మంత్రి ఏంటీబీ నాగరాజు, ఎమ్మెల్యే సుధాకర్ ముఖ్యమంత్రి సిద్దరామయ్యాను కలిసేందుకు బయలు దేరారు,రాజీనామాలు వెనక్కి తీసుకోవాలని శివకుమార్ వారిని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: