హిందుపురం ఎంఎల్ఏ బాలకృష్ణ దగ్గర పిఏ కు మూడేళ్ళు జైలు శిక్ష పడటం తెలుగుదేశంపార్టీలో సంచలనంగా మారింది. సినీనటుడు, చంద్రబాబునాయుడు బావమరిది కమ్ వియ్యంకుడు కమ్ హిందుపురం ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణ కు శేఖర్ అనే వ్యక్తి  పిఏ గా పనిచేశారు. హిందుపురంలో ఉంటూ బాలకృష్ణ వ్యవహారాలన్నింటినీ చక్కపెట్టేవారు.

 

విషయం ఏమిటంటే బాలకృష్ణకు ఎటూ నియోజకవర్గంలో వ్యవహారాలు పట్టించుకునే తీరికుండదు కాబట్టి తానే ఎంఎల్ఏ అన్నట్లుగా పిఏ వ్యవహారాలు నడిపారు. ఏమి చేసినా అడిగేవారు లేకపోవటంతో పిఏ అరాచకాలకు తెరలేపారు. దాంతో పార్టీలోను బయట పెద్ద ఎత్తున గొడవలయ్యాయి. పార్టీ నేతలైనా సరే ఏ పనికావాలన్నా పిఏకి డబ్బులు ఇచ్చుకోవాల్సిందే అన్నంతగా వ్యవహారం ముదిరిపోయింది.

 

అంతకుముందు తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటిలో అసిస్టెంట్ ఇంజనీర్ గా పని చేస్తున్నపుడు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలపై 2008లో కేసు కూడా నమోదైంది లేండి. ఆ కేసు తేలేంతలోగానే బాలకృష్ణ దగ్గరకు పిఏగా వచ్చి దుకాణం పెట్టాడట. ఇక్కడ కూడా గొడవ అవటంతో తీసేశారు.  

  

మొత్తానికి ఆ కేసు విచారణ ఇపుడు పూర్తయింది. మొత్తానికి శేఖర్ అవినీతికి పాల్పడ్డాడని నిర్ధారణ అవటంతో నెల్లూరు ఏసిబి కోర్టు మూడేళ్ళు జైలు శిక్షతో పాటు మూడు లక్షల రూపాయల ఫైన్ కూడా వేయటం సంచలనంగా మారింది.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: