వైద్య, ఆరోగ్యశాఖ జోన్-1 పరిధిలిలో జరిగిన స్టాఫ్ నర్సులు  బదిలీలకు బ్రేక్ పడ్డాయి. వైద్య , ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో మూడు జిల్లాలకు చెందిన 160 మంది స్టాఫ్ నర్సులకు జరిగిన బదిలీలను నిలిపివేలంటూ వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి  జవహర్ రెడ్డి ఆదేశాలిచ్చారు. దీంతో అప్పటికే బదిలీ ఉత్తర్వులు తీసుకుని జాయినింగ్ కేంద్రాలకు వెళ్లిన ఆయా స్టాఫ్ నర్సులు తిరుగుముఖం పట్టారు.   ఉన్నతాధికారుల ఆనిర్ణయంపై పలువురు స్టాఫ్ నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం  బోధనాస్పత్రుల్లో పని చేస్తున్న  నర్సులు భారీగా బదిలీ కావడం వల్ల ఆయా ఆసుపత్రుల్లో సేవలపై పెను ప్రభావం చూపించే అవకాశముందని , అందువల్లే నర్సుల బదిలీలు నిలిపివేస్తున్నట్లు వైద్య , ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి  స్పష్టం చేసారు. ప్రభుత్వ బదిలీలకు నిర్ణయం తీసుకోవడంతో వైద్య, ఆరోగ్య శాఖల్లో భారీగానే మార్పులు జరిగాయి.

ఐదేళ్లకు పైబడి ఒకే చోట విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల్లో 20 శాతం మందికి ఈ బదిలీలలో స్థానచలనం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగానే జోన్-1 పరిధిలో స్టాఫ్ నర్సుల హెడ్ పిహెచ్ ఎన్ (ఎన్ టి) , పిహిచెన్ (టి),(ఎఫ్), (ఎం) ,(ఈవో) తదితర సిబ్బందికి బదిలీలు నిర్వహించారు. అయితే ఆయా కేడర్ ఉద్యోగులకు ఎవరితోను సంబంధం లేకుండా స్టాఫ్ నర్సుల బదిలీలను నిలిపేయడంపై పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడురు. ఏళ్ల తరబడి వేర్వేరు ప్రాంతాల్లో పని చేస్తున్న తమకు నచ్చిన ప్రాంతాల్లో పని చేసేందుకు అవకాశం లభిస్తుంటుందని భావించిన తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవం పై ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు.

ఒకే చోట పనిచేస్తున్న కొందరు ఉన్నతస్థాయిలో చక్రం తిప్పడం వల్లే ఈ బదిలీలు నిలుపుదలకు కారణమని పేర్కొన్నారు. బోధనాసుపత్రిల్లో సేవలపై ప్రభావం చూపకూడదన్న ఉద్దేశ్యంతో నే బదిలీలను నిలిపివేస్తున్నట్లు పేర్కొంటున్న అధికారులు ఇతర ఆసుపత్రుల నుంచి బోధనాసుపత్రిల్లో పని చేసేందుకు వచ్చిన వినతులను ఎందుకు సమ్మతించడంలేదో చెప్పమని పలువురు స్టాఫ్ నర్సులు డిమాండ్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: