జగన్ శక్తి ఏంటో అందరి కంటే ఎక్కువ తెలిసిన వారు చంద్రబాబే. అందుకే ఆయన్ని మొగ్గలోనే తుంచేయాలనుకున్నారు. వైఎస్సార్ చనిపోయాక జగన్ కి సీఎం అయ్యే చాన్స్ వచ్చింది. ఆయితే  జగన్ని సీఎం కాకుండా చేసిన కాంగ్రెస్ బ్యాచ్ కి వెనక ఉన్నది చంద్రబాబు అంటారు. ఢిల్లీ హైకమాండ్ మనసు మార్చడానికి వైఎస్ వ్యతిరేకులైన కాంగ్రెస్ వాళ్ళు చేసిన ప్రయత్నాలకు కొత్త ఆలోచనలు ఇచ్చి మరీ బాబు జగన్ని విజయవంతంగా అడ్డుకోగలిగారు.


జగన్ ఒకసారి అధికారంలోకి వస్తే పాతుకుపోతారని బాబుకు నాడే తెలుసు. అయితే బాబు ఎత్తుగడల వల్ల ప‌దేళ్ల పాటు జగన్ని దూరంగా ఉంచగలిగారు. ఈ లోగా ఓసారి తాను అధికారం దక్కించుకున్నారు. జగన్ మొండి కావడంతో తన పంతం నెరవేర్చుకుని ముఖ్యమంత్రి పీఠం మొత్తానికి పట్టేశారు. ఇపుడు బాబుకు జగన్ని అడ్డుకునే వ్యూహాలు దాదాపుగా అడుగంటిపోయాయి.


ఇక జగన్ నెలన్నర పాలన దూకుడుగానే సాగింది. మంత్రివర్గ కూర్పు  నుంచి నిన్నటి బడ్జెట్ వరకూ జగన్ మార్క్ చూపిస్తున్నారు. దీంతో టీడీపీలో వణుకు మొదలైంది.  జగన్ ప్రబుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ బడ్జెట్ తో టిడిపి లో ఆ భయం ఇంకా  భయం పెరిగినట్లు అనిపిస్తుంది. మాజీ ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు మాటలు చూస్తే అలా అనిపిస్తుంది. బడ్జెట్‌లో రద్దు చేసినవి, పేర్లు మార్చిన పథకాలు ఎన్నో ఉన్నాయని, అంత మాత్రన ప్రజల మనసుల నుంచి తెలుగుదేశం పార్టీని తొలగించలేరని ఆయన అన్నారు


నవరత్నాల పేరుతో నవ కోతలు, నవ రద్దులు చేశారని ఆరోపించారు. రద్దు చేసిన పాత పథకాలకే నవరత్నాల ముసుగు వేస్తున్నారని ఆరోపించారు. రీటెండరింగ్‌ పేరుతో పోలవరం ప్రాజెక్టు పనులు నిలుపుతున్నారని చెప్పారు. టిడిపి ని ప్రజల మనసులలో నుంచి తీసేయలేరని చెప్పడంలోనే ఆయన భయం కనబడుతుంది. మొతానికి జనాలు ఇపుడు జగన్నామస్మరణ చేస్తూంటే టీడీపీని ఎందుకు గుర్తుంచుకుంటారు.



మరింత సమాచారం తెలుసుకోండి: