అధికారం కోల్పోయిన పార్టీ నుండి వలసలు ఉంటాయనేది సర్వసాధారణం.. కానీ అధికార పార్టీ నుండి నాయకులు వెళ్ళిపోతే ఏమనుకోవాలి.. ఆ పార్టీలో కుమ్ములాటలు మొదలైయి..  తారా స్థాయికి చేరయ్యాయని ఒక నిర్ధారణకు రావొచ్చు. ఇంతకీ ఆ కుమ్ములాటలు   వైసీపీ పార్టీలో కావడం విశేషం.  భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా  జగన్ తనదైన శైలిలో పాలనను పరుగులు పెట్టిస్తున్నా.. పూర్తిగా సఫలం అవ్వలేకపోతున్నాడేమో అనిపిస్తోంది.  అందుకు నిదర్సనం వైసీపీ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెటే.  అలాగే తన పార్టీ నాయకులను కూడా కంట్రోల్ చెయ్యలేకపోతున్నాడట.     


వైసీపీ పార్టీ నేత మాజీ మంత్రి ఒకరు జగన్‌ పై గుర్రుగా ఉన్నారు.  ఒకప్పుడు  శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను కనుసైగలతో శాసించిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు జగన్ పై కోపంగా ఉన్నాడు. గతంలో వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌ ల్లో  మంత్రిగా ధర్మాన ఓ వెలుగు వెలిగాడు.  జగన్ మంత్రివర్గంలో చోటు దక్కడం ఖాయమని ధర్మాన భావించారు. అయితే ధర్మానకు జగన్ మంత్రి పదవి ఇవ్వలేదు. ఇది ధర్మాన అవమానంగా భావిస్తున్నారట. ఎలాగూ మంత్రి పదవి ఇవ్వలేదు.. కనీసం ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాల్లోనైనా మాటవరసకు కూడా తనను అడగటంలేదని ధర్మాన ఫీల్ అవుతున్నారు. ఇది గమనించిన బీజేపీ ధర్మానను తమ పార్టీలో కలుపుకోవటానికి గట్టిగానే  ప్రయత్నాలు చేస్తోంది. దానికి ధర్మాన కూడా అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ధర్మాన పార్టీ మారితే మాత్రం   శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బే.            

  


మరింత సమాచారం తెలుసుకోండి: