తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టిఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలిచి రెండోసారి అధికారాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే,ఆ తర్వాత వరుసగా రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టారు.అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజారిటీ తో గెలిచినా లోకసభ ఎన్నికల్లో అనుకున్న స్థానాలను సాదించలేక పోయింది.అయితే గత కొద్దిరోజులుగా పార్టీ పై పాలనపై దృష్టిసారించిన సీఎం కేసీఆర్ కు రెండురోజుల ముందు గట్టి షాక్ తగిలింది.

పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ రాజీనామా చేశారు.అలాగే రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ కూడా పార్టీ మారుతున్నట్టు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి.కొద్దిరోజులుగా ఈయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం,తాజాగా బీజేపీ నాయకుడు అమిత్ షా ని కలవడం పార్టీలో కలకలం రేపుతోంది.

కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎంపీలు త్వరలోనే బీజేపీ లోకి వస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు.డీఎస్ తో పాటు చాలా మంది బీజేపీలో చేరుతున్నారని వ్యాఖ్యానించారు.తెలంగాణలో బీజేపీ నే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని అన్నారు.కవిత, వినోద్ ఓటమితో కేసీఆర్ పతనం మొదలయింది అని ఆయన అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: