జగన్ సీఎం గా ఉంటున్నా ఎక్కడా ఆర్భాటాలకు పోకుండా చూసుకుంటున్నారు. తనకు ఓటేసి గెలిపించిన ప్రజలను దేవుళ్ళుగా భావిస్తూ ఆయన పాలన సాగిస్తున్నారు. ఈ క్రమంలో తన అధికారిక పర్యటనలు, రాకపోకల వల్ల సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలుగకుండా చూసుకుంటున్నారు.


తాజాగా  తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్‌ వెళుతుండగా.. బెంజ్‌ సర్కిల్‌ సమీపంలో ఓ ప్రైవేటు అంబులెన్స్‌ అటుగా వచ్చింది. మొదట అంబులెన్స్‌కు దారి ఇచ్చిన అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ తన కాన్వాయ్‌ను ముందుకుపోనిచ్చారు. ప్రజలకు, ముఖ్యంగా అంబులెన్స్‌కు ఏమాత్రం అసౌకర్యం కలుగకుండా సీఎం కాన్వాయ్‌ వ్యవహరించడం, అంబులెన్స్‌కు దారి ఇచ్చిన తర్వాతే సీఎం వైఎస్‌ జగన్‌ ముందుకుసాగడం విశేషం.


ప్రజలకు ఇబ్బంది కలుగకూడదన్న ఆయన మానవీయ హృదయానికి, ప్రజానిబద్ధతకు నిదర్శమని దీనిని గమనించిన స్థానికులు పేర్కొంటున్నారు. గతంలో హైదరాబాద్ పర్యటనలో కూడా జగన్ ఈ విధంగానే వ్యవహరించారు. మొత్తం మీద చూసుకుంటే జగన్ ప్రజలకు ఇస్తున్న ప్రాధాన్యత ఆయనలోని మానవీయ కోణాన్ని బయటపెడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: