ప్రపంచంలో ఉదయం మొదలు కొని రాత్రి వరకు సోషల్ మాద్యమాలతో యూత్ కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్ స్ట్రాగామ్ తో చిట్ చాట్ చేయకుండా ఉండలేని పరిస్థితి వచ్చారు.  ఈ జాడ్యం సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు పట్టుకుంది.  ముఖ్యంగా ప్రపంచాన్ని ఏలేస్తున్న ఫేస్ బుక్ గురించి తెలియని వారు ఉండరు.  పర్సనల్ గా బ్యాంక్ అకౌంట్స్ లేని వారైనా ఉంటారు కానీ ఫేస్ బుక్ అకౌంట్ లేనివారు ఉన్నారంటే చెప్పడం కష్టం.  అంతగా అల్లుకు పోయిన ఫేస్ బుక్ తో ఎన్ని లాభాలు ఉన్నాయో..అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. 

ఫేస్ బుక్ ద్వారా ఎప్పుడో దూరమైన స్నేహితులు, కన్నవారు కలిసిన సంఘటనలు ఉన్నాయి..ఫేస్ బుక్ ల ద్వారా పరిచయాలు ఏర్పడి పెళ్లిళ్లు చేసుకున్న వారు ఉన్నారు..మోసాలు చేసిన వారు ఉన్నారు. గత కొంత కాలంగా ఫేస్ బుక్ పై ఎన్నో ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.  తమ కస్టమర్ల పర్సనల్ డేటాను లీక్ చేసిందన్న ఆరోపణలపై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ పై భారీ జరిమానా విధించేందుకు అమెరికా నియంత్రణ సంస్థలు సిద్ధపడ్డాయి. తాజాగా 'వాల్ స్ట్రీట్ జర్నల్'లో ప్రచురితమైన కథనం ప్రకారం, ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ (ఎఫ్టీసీ) సెటిల్ మెంట్ లో భాగంగా ఫేస్‌ బుక్‌ పై రూ. 34,280 కోట్ల (5 బిలియన్‌ డాలర్లు) జరిమానా విధించనుంది.

  అయితే ఇప్పటి వరకు ఈ రేంజ్ లో భారీ జరిమాన విధించిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు.  కాగా, వ్యక్తిగత భద్రతా వైఫల్యాలకు సంబంధించి ఓ సంస్థపై ఎఫ్‌టీసీ ఇంత భారీ జరిమానాను విధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే, ఈ జరిమానాను అమెరికా న్యాయశాఖ ఆమోదించాల్సివుంది. వ్యక్తిగత భద్రతకు సంబంధించి ఫేస్‌ బుక్‌ కు కొన్ని కఠిన ఆంక్షలను కూడా ఎఫ్టీసీ విధించనున్నట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: