ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ పరిస్థితి దారుణంగా మారిపోయింది.  కేవలం 23 స్థానాల్లో మాత్రమే విజయం సాధించడంతో పాటు వైకాపా, బీజేపీల నుంచి ఒత్తిడిలు పెరుగుతుండటంతో... తెలుగుదేశం పార్టీ నుంచి నేతలు బీజేపీలోకి వలసలు జరుగుతున్నాయి.  


ఈ వలసలను బాబుగారు అడ్డుకోలేకపోయారు. పార్టీ నాయకులను బుజ్జగించలేకపోతున్నారు.  దీనికి కారణం లేకపోలేదు.  బాబు జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు.  ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉన్నారు.  ఆయన స్థానంలో మొదట శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడును నియమించాలని అనుకున్నారు.  


ఇప్పటి వరకు దానిపై నిర్ణయం తీసుకోలేదు.  ఇప్పుడు మరో మాట వినిపిస్తోంది. కళా వెంకట్రావు స్థానంలో బాలకృష్ణను తీసుకోవాలని, అలా తీసుకుంటే టిడిపి తిరిగి గాడిలో పడుతుందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.  బాబు కూడా ఆ దిశగానే ఆలోచిస్తున్నారని సమాచారం.  


బాలయ్య మాత్రం తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.  ఎందుకంటే ఇప్పుడు బాలయ్య దృష్టి మొత్తం సినిమాపైనే ఉన్నది.  ఎలాగైనా సినిమా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.  ఆలోచన, దృష్టి సినిమాలవైపు ఉన్నప్పుడు వీటిని ఎలా రాజకీయాలను ఎలా మ్యానేజ్ చేస్తారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: