ఇది చదివే ముందు, ఎన్నికల సమయంలో వై.ఎస్‌.జగన్‌ పాదయాత్ర గుర్తు చేసుకోవాలి. భారీ జనసందోహ మధ్య ఒక బహిరింగ సభలో జగన్‌ ప్రసంగిస్తున్నారు. అదే సమయంలో ఒక ఆంబులెన్స్‌ వచ్చింది. ఎలా వెళ్లాలో తెలియక జనంలో చిక్కుకు పోవడం గమనించిన జగన్‌ తన ప్రసంగాన్ని ఆపి, ఆంబులెన్స్‌కి దారివ్వండి అని తన కార్యకర్తలకు వేదిక మీద నుండి చెప్పారు. ఆంబులెన్సు వెళ్లిపోయే వరకు... ఆగి ఆ తరువాతే ప్రసంగం పూర్తిచేశారు. జగన్‌లోని మానవీయ కోణం చూడకుండా, ఇదంతా ఓట్ల కోసం అని ఆ రోజు ప్రతిపక్షం విమర్శించారు.

ఈ రోజు జగన్‌ ముఖ్యమంత్రి అయ్యారు. జనసంక్షేమం లక్ష్యంగా, సుపరిపాలన అందిస్తున్నారు. ఈ క్రమంలో తన అధికారిక రాకపోకల వల్ల సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలుగకుండా చూసుకుంటున్నారు. ా శనివారం తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ వెళుతుండగా.. బెంజ్‌ సర్కిల్‌ సమీపంలో ఓ ప్రైవేటు అంబులెన్స్‌ వచ్చింది. వెంటనే తన కాన్వాయ్‌ వేగం తగ్గించి, ముందుగా, అంబులెన్స్‌కు దారి ఇచ్చిన అనంతరం , తన కాన్వాయ్‌ను ముందుకుపోనిచ్చారు.

తన వల్ల ప్రజలకు, ముఖ్యంగా అంబులెన్స్‌కు ఏమాత్రం అసౌకర్యం కలుగకుండా సీఎం కాన్వాయ్‌ వ్యవహరించడం, అంబులెన్స్‌కు దారి ఇచ్చిన తర్వాతే, జగన్‌ ముందుకు సాగడం. గమనించిన విజయవాడ ప్రజలు..'' ఇది వరకెపుడూ, ప్రజలకు ఇబ్బంది కలుగ కుండా, మానవీయంగా వ్యవహరించిన నాయకుడిని ఎన్నడూ చూడలేదని, జగన్‌ గారి వ్యవహార శైలి ప్రజానిబద్ధతకు నిదర్శమని..'' సంతోషంగా అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: