కలెక్టర్ కార్యాలయాలలోని ఏ,బి,సి,డి,ఇ,ఎఫ్,జి,హెచ్, విభగాలలోని అనేక సీట్లు ఖాళీ అయ్యాయి. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో ఉద్యోగులకు స్థానచలనం కలిగిన సంగతి తెలిసిందే. ఖాళీ అయిన స్థనాల్లో  తహసీల్దార్ల స్థాయి అధికారులను  నియమించాల్సి ఉంది. కొంత కాలంగా అన్ని విభాగాల్లో పూర్తిస్థాయి అధికారులు విధులు నిర్వహించేవారు. గత ఏప్రిల్ నెలలో ఇద్దరు పర్యవేక్షకులు ఉద్యోగ  విరమణ చేయడం, అనంతరం మిగిలిన వారు కూడా ఉంద్యోగ విరమణ చేయడంతో నాలుగు విభాగాల్లో పర్యవేక్షకుల పోస్ట్లు ఖాళీ అయ్యాయి. ఇటీవల బదిలీల్లో పరిపాలనాధికారి కూడా పక్క జిల్లాకు వెళ్లిపోవడంతో ఆ పోస్ట్ కూడా ఖాళీ అయింది . ప్రస్తుతం కీలకమైన ఎ-విభాగంలో పరిపాలనాధికారులు  ఎఫ్,జి,హెచ్ విభాగాలు ఇంచార్జుల పాలనలో కొనసాగుతున్నాయి.

ఖాళీలు  కానున్న కీలక సీట్లు 
కలెక్టరేటులోని డి,ఇ విభగాల్లోని పర్యవేక్షకులు ఈ నెలాఖరుకు ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీంతో మరో రెండు విభాగాల పర్యవేక్షకుల సీట్లు కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం ఆర్డీవో కార్యాలయంలో ఉప తహసీల్దార్లుగా విధులు నిర్వహిస్తున్న అధికారిని డిప్యుటేషన్ పై నియమించారు. బి-విభాగం పర్యవేక్షకులు వచ్చే నెలలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఇలా చూస్తే అన్నివిభాగాల్లోనూ అత్యంత కీలకమైన పర్యవేక్షకుల సీట్లు ఖాళీ అవున్నాయి.

అందరిని బయటకు పంపేశారు
ఎన్నికల నిర్వహణ అనంతరం ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఆ జిల్లాకు చెందిన తహసీల్దార్లను కలెక్టర్ కార్యాలయంలో నియమించకుండా అందిరినీ బయటకు పంపించేశారు. ఎక్కడ అవసరమో ఆయా స్థానాలను ముందుగా భర్తీ  చేయకుండా వీరిని మండలాలకు పంపించేశారు. దీంతో పాలనకు గుండెకాయలాంటి కలెక్టర్ కార్యాలయంలో మాత్రం సీట్లల్లో ఖాళీగా ఉంచేశారు. పరిపాలనాధికారి నియామక సకాలంలో చేపట్టకపోతే జీతాల బిల్లులు కూడా పెట్టడానికి వీలుండదు. పాలన కూడా గాడి తప్పే ప్రమాదం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: