జగన్ కేంద్రంలో సఖ్యత కోరుకుంటున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోకి సమస్యలకు పరిష్కారం చూపాలనుకుంటున్నారు. అందుకు కేంద్రం సాయం  తప్పనిసరి. అందువల్లనే ఆయన ఫలితాలు వచ్చిన మరుసటి రోజే ఢిల్లీ వెళ్ళి పెద్దలను కలసి వచ్చారు. ఆదుకోమని అభ్యర్ధించారు.


అయితే కేంద్రం తీరు మాత్రం మారలేదు. అందుకే ఏపీకి బడ్జెట్ లో ఉత్త చేయి చూపించింది. జగన్ కోరుతున్నట్లుగా ప్రత్యేక హోదా ఇవ్వలేమని పదే పదే చెబుతూ ఇరిటేషన్ తెప్పిస్తోంది. విభజన హామీలకు దిక్కూ దివాణం లేదు. ఈ నేపధ్యంలో తాజాగా జగన్ నిర్ణయం మీద కేంద్ర మంత్రి ఒకరు ఘాటుగా లేఖ రాయడం విశేషం.


విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పై సమీక్ష చేసేందుకు సిద్ధపడవద్దంటూ గట్టిగానే ఆ లేఖలో కేంద్ర మంత్రి చెప్పేశారు. దీని వల్ల చాలా పర్యవసానాలు ఎదుర్కోవాల్సివస్తుందని కూడా సున్నితంగా హెచ్చరించడం విశేషం. పెట్టుబడులు కూడా రాకుండా వెనక్కుపోతాయని చెప్పడం జరుగుతోంది. మరి జగన్ ఇపుడు ఏం చేస్తారు. 


తాను గెలిచిన మరుసటి రోజు నుంచే విద్యుత్ కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని జగన్ అంటున్నారు. దాని మీద మంత్రి వర్గ ఉప సంఘాన్ని నయమించారు. నిపుణుల కమిటీని కూడా వేశారు. ఇపుడు వెనక్కు తగ్గుతారా. తన స్వభావానికి తగినట్లుగా ముందుకు దూకుడుగా సాగుతారా.. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: