వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి. ఆయన బంపర్ మెజారిటీతో గెలిచి సీఎం సీట్లో కూర్చున్నారు. ఈ రోజుకు సరిగ్గా నలభై ఆరు రోజులైంది జగన్ సర్కార్ ఏర్పడి. అన్ని నిర్ణయాలు దూకుడుగా జగన్ తీసుకుంటున్నారు. ఆయన పలన మీద జనంలో కూడా హర్షం వ్యక్తం అవుతోంది.


అయితే ఏపీలో బీజేపీ మాత్రం జగన్ విషయంలో పెద్ద నోరు చేస్తోంది. జగన్ గెలిచిన తరువాత వాయిస్ పూర్తిగా మార్చేసింది. జగన్ కి  కనీసం టైం కూడా ఇవ్వకుండా పెద్ద  డిమాండ్లు పెడుతోంది. బాబుని తిట్టిన నోర్లే ఇపుడు జగన్ మీద కూడా లేస్తున్నాయి. ప్రత్యేక హోదాపై మాట్లాడకు అంటూ వార్నింగులు ఇస్తున్నారు.


ఈ నేపధ్యంలో జగన్ ఇపుడు కొన్ని విషయాల్లో కేంద్రం మీద పూర్తిగా ఆధారపడి ఉన్నారు. నిధుల గురించే కాదు, జగన్ మీద ఉన్న కేసుల విషయంలో కూడా కేంద్రం దయా దాక్షిణ్యం అవసరమన్న మాట వినిపిస్తోంది. జగన్ సీఎం కాక ముందు ప్రతీ శుక్రవారం సీబీఐ కోర్టుకు వెళ్ళేవారు.


ఇపుడు ముఖ్యమంత్రిగా  ప్రత్యేక వెసులుబాటు కోరుతున్నారు. అయితే ఇప్పటికైతే  ఏ వారానికి ఆ వారం సీబీఐ ముందు జగన్ న్యాయవాది ముందస్తు పర్మిషన్ తీసుకుంటేనే అది సాధ్యపడుతుంది. ఈ విషయంలో తనకు పూర్తి మినహాయింపు కావాలని జగన్ కోరుకుంటున్నారు. దానికి కేంద్రం అభయం ఇచ్చినట్లుగా కొత్తల్లో వినిపించింది.


ఇపుడు మాత్రం జగన్ రాజకీయాన్ని బ్రేక్ చేయాలనుకుంటున్న బీజేపీ ఆ చాన్స్ ఇస్తుందా అన్నది పెద్ద ప్రశ్న. అదేం కుదరదు అనుకుంటే  ముఖ్యమంత్రి హోదాలో జగన్ సీబీఐ కోర్టు బోనులో నిలుచోవాల్సిందే. అపుడు జగన్ మీద దారుణమైన విమర్శలు వస్తాయి. మరి అదే బీజేపీకి కావాల్సింది అయినపుడు జరిగేది కూదా అదేనేమోనన్న బెంగ వైసీపీ నేతల్లో ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: