మనం తాగే మంచినీళ్లు కలుషితమై చాలా రోజులు అయిపోయింది. దీంతో ఇప్పుడు ఎవరికి వారు నల్లా నీళ్లు వదిలేసి మినరల్ వాటర్ తాగుతున్నారు. తాగే నీళ్ల విష‌యంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజా అధ్యయనంలో వెల్ల‌డైన వార్త వింటే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నివ‌స‌రించే వాళ్లు గుండెలు ఆగిపోతాయి. ప్రస్తుతం హైదరాబాద్లో పీల్చేగాలి ప్రతి ఒక్కరిని మరణానికి చేరువ చేస్తోందన్న‌ భయంకరమైన నిజం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని గ్రీన్ పీస్ సంస్థ వెల్లడించింది.


ఆ సంస్థ తాజా అధ్యయనంలో హైదరాబాద్ లో విపరీతమైన వాయు కాలుష్యం పెరిగి పోయినట్టు వెల్లడైంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే భారీ పరిశ్రమలు వెలువ‌రించే పొగ‌... లక్షలాది మంది నిత్యం రోడ్లపై వాహనాలలో ప్రయాణించడం కారణంగా భయంకరమైన కాలుష్యం వెలువ‌డుతోంద‌ని.... ఈ గాలి పిలుస్తున్న నగరవాసులు కొత్త రకాల జబ్బులకు గురవుతున్నారు ఈ అధ్యయనంలో వెల్లడైంది. పెరుగుతున్న వాయు కాలుష్య తీవ్రతతో హైదరాబాద్ నగరం డేంజరస్ గా మారుతుందన్న మాట ఆ సంస్థ పేర్కొంది.


వాయు కాలుష్యంలో నైట్రోజన్ ఆక్సైడ్ బాగా పెరిగిపోవ‌డంతో ... అత్యంత సూక్ష్మమైన ధూళితో ప్రజలు జబ్బున పడేలా చేస్తున్నాయని తేల్చింది. పీల్చే గాలిలో ఓజోన్ ఉంటే అది ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఆస్తమా బాధితులు.. పిల్లలు.. పెద్ద వయస్కులు ఈ ప్రమాదకర వాయువుల్ని పీల్చటం ద్వారా ఛాతీనొప్పి.. దగ్గు.. గొంతుమంట.. శ్వాసనాళాల వాపు లాంటి సమస్యలు పొంచి ఉన్నాయి. వాయు కాలుష్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 3.4 మిలియన్ల మంది మరణిస్తే.. భారత్ లో 1.2 మిలియన్ల మంది మరణిస్తున్నారు. ఏదేమైనా ఈ కాలుష్యం అరిక‌ట్టేందుకు ప్ర‌త్యామ్నాయ మార్గాలు చూడ‌క‌పోతే భ‌విష్య‌త్తులో మ‌నం హైద‌రాబాద్‌లో భ‌యాన‌క వాతావ‌ర‌ణం చూడ‌డం ఖాయం.



మరింత సమాచారం తెలుసుకోండి: