2011లో వైసీపీ పార్టీ ప్రారంభమైనప్పటినుండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీ ఇచ్చినా ఆ హామీని వైయస్సార్ పేరుతోనే ఇచ్చేవారు. ప్రసుతం జగన్మోహన్ రెడ్డిగారు అమలులోకి తెచ్చిన పథకాలన్నిటికీ కూడా దాదాపుగా వైయస్సార్ పేరే పెట్టారు. కానీ ఎవరూ ఊహించని విధంగా రెండు పథకాలు మాత్రం జగన్మోహన్ రెడ్డిగారి పేరుతో ప్రారంభమయ్యాయి. ఆ పథకాలే జగనన్న అమ్మఒడి మరియు జగనన్న విద్యాదీవెన. 
 
నిజానికి ప్రతి పథకానికి వైయస్సార్ పేరు పెడుతున్న జగన్మోహన్ రెడ్డిగారు ఈ రెండు పథకాలకు కూడా వైయస్సార్ పేరునే పెట్టాలని అనుకున్నారట. కానీ ఆర్థిక శాఖకు చెందిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరియు మరియు ఇతర మంత్రులు కనీసం ఈ రెండు పథకాలకైనా జగన్మోహన్ రెడ్డి పేరు ఖచ్చితంగా ఉండాలని పట్టుబట్టటంతో ఈ రెండు పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో ప్రారంభమయ్యాయి. 
 
జగనన్న అమ్మఒడి పథకానికి 6455 కోట్ల నిధులు బడ్జెట్లో కేటాయించారు. పిల్లల్ని బడికి పంపే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి తల్లికి అమ్మ ఒడి పథకం వర్తిస్తుంది. అమ్మఒడి పథకానికి అర్హులైన వారికి 2020 సంవత్సరం జనవరి 26వ తేదీన 15,000 రుపాయలు ప్రభుత్వం అందించబోతుంది. జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చేయబోతుంది మరియు హాస్టల్ ఇతర ఖర్చుల కోసం ప్రభుత్వం 20,000 రుపాయల చొప్పున ఇవ్వబోతుంది. జగనన్న విద్యాదీవెన పథకం కోసం 4962 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: