దాదాపు 40 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈ 40 ఏళ్ళ చంద్రబాబు నాయుడి రాజకీయ జీవితంలో 14 సంవత్సరాలపాటు సీఎంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించాడు చంద్రబాబు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడుగారి వయసు 70కి చేరువలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ భాద్యతలు కొడుకు నారా లోకేశ్ కు అప్పగించాలని అనుకున్నా నారా లోకేశ్ రాజకీయాల్లో ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి చెప్పుకునేంత గొప్పగా ఐతే లేదు.కానీ వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఉన్న పార్టీలు తెలుగుదేశం జనసేన మాత్రమే. జనసేన పార్టీ ఇంకా గ్రామ స్థాయి నుండి బలోపేతం కావాల్సి ఉంది. కానీ టీడీపీకి ఆ సమస్య లేదు.కానీ చంద్రబాబు గారికి వయసు కూడా మీద పడుతూ ఉండటంతో తెలుగుదేశం పార్టీ మేలు కోరే కొందరు పార్టీ భాద్యతలు బాలకృష్ణకు లేదా జూనియర్ ఎన్టీయార్ కు ఇవ్వాలని సలహా ఇస్తున్నారట. 
 
పార్టీలో ఎక్కువమంది జూనియర్ ఎన్టీయార్ కు భాద్యలు అప్పగిస్తే బాగుంటుందని సూచించినట్లు తెలుస్తుంది. మరికొందరు మాత్రం జూనియర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా పార్టీ సమావేశాలకు హాజరైతే సరిపోతుందని భావిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం పార్టీ భాద్యతలు బాలకృష్ణకు లేదా జూనియర్ ఎన్టీయార్ కు ప్రసుతానికైతే ఇవ్వటానికి ఇష్టపడటం లేదని సమాచారం. కానీ భవిష్యత్తులో మాత్రంలో ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు టీడీపీ భాద్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: