Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 18, 2019 | Last Updated 4:46 am IST

Menu &Sections

Search

ఎమ్మార్వో లావ‌ణ్యకు ఆయ‌నే బినామీ...అవాక్క‌య్యే నిజాలు

ఎమ్మార్వో లావ‌ణ్యకు ఆయ‌నే బినామీ...అవాక్క‌య్యే నిజాలు
ఎమ్మార్వో లావ‌ణ్యకు ఆయ‌నే బినామీ...అవాక్క‌య్యే నిజాలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నోట్ల క‌ట్ట‌లు...డ‌బ్బుల గుట్ట‌ల‌తో దొరికిపోయిన రంగారెడ్డి జిల్లా కేశంపేట తహ‌శీల్దార్ లావణ్య కేసు ఊహించ‌ని మ‌లుపు తిరుగుతోంది. ప‌బ్లిక్‌గా, రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఎమ్మార్వో అవినీతి విష‌యంలో అన్ని అవ‌కాశాలు ఉప‌యోగించుకున్న‌ట్లు స‌మాచారం. బినామీ బాగోతాల‌కు సైతం ఆమె తెర‌లేపార‌ని స‌మాచారం. ఏకంగా ఏసీబీ సైతం ఆమె ఆఫీసులో ప్ర‌త్యేకంగా సోదాలు చేస్తోంది. 
కేశంపేట తాసిల్దార్ లావణ్యకు రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట మున్సిపాల్టీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆమె దగ్గర బంధువు ఒకరు బినామీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏసీబీ అధికారుల నుంచి సదరు ఉద్యోగికి ఫోన్లు రావడంతో ఆయన స్విచ్చాఫ్ చేసినట్టు సమాచారం. లావణ్య ఏసీబీకి దొరికినరోజు నుంచి ఈ ఉద్యోగి మున్సిపాల్టీలో విధులకు రావడం మానేశారు. ఈయన పనిచేస్తున్న విభాగంలో రూ.లక్షల అవినీతి జరుగుతున్నట్టు గతంలో ప్రజాప్రతినిధులు, సీపీఐ నాయకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడం గమనార్హం.


కాగా, కేశంపేట తహ‌శీల్ధార్ కార్యాలయంలో అవినీతి కారణంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారుల ఫైళ్ల పరిష్కారంపై ఏసీబీ అధికారులు దృష్టిసారించారు. గత రెండ్రోజులుగా పెండింగ్ ఫైళ్లపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం 450కి పైగా ఫైళ్లు పెండింగ్‌లో ఉండగా.. సంబంధిత రైతులను ఫోన్ల ద్వారా పిలిపించి, వివరాలు సేకరిస్తున్నారు. మరో రెండ్రోజుల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలన పూర్తిచేసి, సమస్యపై రెవెన్యూ ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. 


అవినీతి కేసులో ఏసీబీకి పట్టుబడిన నేపథ్యంలో ఆమెపై రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకొంటుంది. తహ‌శీల్ కార్యాలయంలో భూ మార్పిడి, విరాసత్, పాత డాక్యుమెంట్ల మ్యుటేషన్ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల ఫైళ్లు కుప్పలు తెప్పలుగా ఉండిపోయాయి. కార్యాలయంలో డబ్బులిచ్చినవారి పనులు మాత్రమే తొందరగా పూర్తయ్యేవని రైతులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదుచేశారు. తమ భూములకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో సక్రమంగా నమోదుచేయలేదని.. దీనితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తాము ప్రతిరోజూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. పనులుకావడంలేదని వాపోతున్నారు. 
తమ తండ్రి ఆస్తిలో తమకు రావాల్సిన వాటాను తాసిల్దార్ లావణ్య తమకు దక్కకుండా చేశారని చౌలపల్లి గ్రామానికి చెందిన మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. చౌలపల్లికి చెందిన సయ్యద్ యూసుఫ్‌బీకి సర్వే నంబర్ 73/అ లో 3.24 ఎకరాల భూమి ఉన్నది. ఆమెకు కుమారుడు సయ్యద్ సలాం, ముగ్గురు కుమార్తెలు షహాజాదీ ఉన్నిసా, యాస్మిన్‌బేగం, బిస్మిల్లా ఉన్నారు. భూమిలో వాటా కావాలని ముగ్గురు కుమార్తెలు తల్లిని కోరగా.. అందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో వారు తాసిల్దార్‌కు ఏప్రిల్ 19న ఫిర్యాదుచేశారు. తాసిల్దార్ వారి అభ్యంతరాన్ని లెక్కచేయకుండా యూసుఫ్‌బీ కొడుకు పేరిట పట్టాచేస్తూ ఏప్రిల్ 24న ప్రొసీడింగ్ ఇచ్చారు. తాసిల్దార్ లావణ్య, అప్పటి వీఆర్వో రాములు సయ్యద్ సలాం వద్ద డబ్బు తీసుకుని భూమిని అతని పేరిట పట్టాచేశారని బాధితులు ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి తండ్రి ఆస్తిలో కూతుళ్లకు రావాల్సిన వాటాపై విచారణ చేపట్టాలని కోరారు.


lavnya-mro-acb
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఏపీ మంత్రి సంచ‌ల‌నం...పేర్ని నాని ఏం చేశారంటే...
మైన‌ర్ బాలిక‌పై దారుణం..గ్రామ‌పెద్ద‌కు త‌గిన శిక్ష‌
కేసీఆర్‌పై విజ‌య‌శాంతి సంచ‌ల‌న విమ‌ర్శ‌లు...కుట్ర పేరుతో..
డ్రోన్ రాజకీయాలు...వైసీపీ, టీడీపీల‌ను ఉద్దేశించి జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు
భార‌తీయుల మూడ్ ఒక‌టి..మోదీ స‌ల‌హా ఇంకొక‌టి
పాపం పాక్‌..ఐరాసాలో దిమ్మ‌తిరిగే షాక్‌
నిన్న ఉత్త‌మ పోలీస్‌..నేడు అవినీతిలో దొరికిన చేప‌
తిక్క కుదిరిన ట్రంప్...క‌శ్మీర్ విష‌యంలో కీల‌క ప్ర‌క‌ట‌న‌
మ‌ద్యపాన నిషేధం...ఏపీ స‌ర్కార్ కీల‌క ఆదేశాలు
ఏపీ ప్ర‌భుత్వంలో టెర్ర‌రిజం... బ‌డా వ్యాపారవేత్త సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
లండ‌న్‌లో భాతీయుల‌పై దాడి... చేసింది ఎవ‌రో తెలుసా?
క‌శ్మీర్‌లో ఉగ్ర‌దాడులు...అవ‌స‌ర‌మైతే అణ్వాయుధాలు వాడ‌ట‌మే
పుర‌పాల‌క చ‌ట్టంపై హైకోర్టులో వాద‌న‌లు..అస‌లు తీర్పు ఎప్పుడంటే
కేంద్ర‌మంత్రి మిస్సయిన వ్య‌క్తికి రాష్ట్రమంత్రి హోదా ఇచ్చిన కేసీఆర్‌
హైద‌రాబాద్ ద‌శ‌ను మార్చే నిర్ణ‌యం..కేసీఆర్ ఓకే అంటే...
డేరాబాబా...జైల్లో ఉండి వాళ్ల‌కు ఎలా చుక్కలు చూపిస్తున్నాడంటే...
ఇండియాకు పాక్‌ షాక్‌..ఆయ‌న‌కు నోటీసులు ఇచ్చి కెలికిన పాక్‌
తెలుగు రాష్ట్రాలు ఆశ్చ‌ర్య‌పోయేలా స్మృతి ఇరానీ ఏం చేశారంటే...
ద‌టీజ్ ముఖేశ్‌...ఒక్క మాట‌తో 29,000 కోట్లు సంపాదించాడు
క‌శ్మీర్‌పై కొత్త కుట్ర... ఐరాసాలో పాక్‌-చైనా క‌లిసి
ప్ర‌తి ఒక్క‌రీ హెల్త్ డాటా స‌ర్కారు చేతిలో ...తెలంగాణలో మ‌రో కీల‌క ప‌థ‌కం
రాజ్‌భ‌వ‌న్‌లలో రక్షాబంధ‌న్‌...తెలుగు రాష్ట్రాల‌లో సంద‌డి
మైక్ టైస‌న్ మ‌త్తుమందు వ్యాపారం..ఒక్క ద‌మ్ముకే 28 ల‌క్ష‌లు
హైద‌రాబాద్‌లో గుంటూరు అమ్మాయి కిడ్నాప్‌...`రాక్ష‌సుడు` సినిమాతో ఊహించ‌ని ట్విస్ట్‌
ఎఫ్ఆర్ఓ అనితకు గోల్డ్‌మెడ‌ల్‌...ఎవ‌రు ఎంపిక చేశారంటే..
మోదీ ఎర్ర‌కోట ప్ర‌సంగం...కొన్ని ప్ర‌శ్న‌లు..ఎన్నో ఆశ‌లు..
బాబుపై త‌ల‌సాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...బీజేపీతో క‌లిసి...
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచ‌ల‌న నిర్ణ‌యం...అల‌కా...ధైర్య‌మా?
విక‌లాంగుడి జీవితంలో కొత్త వెలుగులు నింపిన కేటీఆర్‌...
రాయ‌ల‌సీమ త‌ర్వాత‌..ముందు తెలంగాణ సంగ‌తి చూడు కేసీఆర్‌
ఆ గ‌వ‌ర్న‌ర్‌కు చుక్క‌లు చూపిస్తున్న రాహుల్‌...ఊపిరి స‌లుపుకోనివ్వ‌కుండా...
ఆ చెట్లు కొట్టేస్తే...నాన్ బెయిల‌బుల్ కేసు...
అల‌ర్ట్ః భారీ వ‌ర్ష సూచ‌న‌...గ్రేట‌ర్ ప‌రిధిలో..
మోదీకి అంత నాలెడ్జ్ లేదు...ఏదీ శాశ్వతం కాదు గుర్తుంచుకో
ట్రంప్‌కు జ్ఞానోదయం...కశ్మీర్‌పై కీల‌క నిర్ణ‌యం
చిదంబ‌రం భూమికి భారం....సీఎం వివాదాస్ప‌ద కామెంట్లు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.