-వ్యవసాయానికి ఊతమిచ్చే పథకాలు.. 

-రైతును ఆదుకునేలా కేటాయింపులు..

రైతుకు పంటే ప్రాణం. ఆ పంటకు వాతావరణం ఊపిరి. ఆ పంట చేతికందకపోతే రైతు తట్టుకోలేడు. వాతావరణం అనుకూలించకపోతే పంట తట్టుకోలేదు. రైతు బాంధవుడిగా అన్నదాత గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న దివంగత ముఖ్యమంత్రి  వై.ఎస్.రాజశేకర్ రెడ్డి తనయుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి రైతులకు వెన్నుదన్నుగా నిలబడ్డారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ట్ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చక్కని బాటలు వేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.28,866.23 కోట్లుగా నిర్ణయించారు.

ఇందులో ప్రధానంగా వస్తున్న రబి సీజన్ నుంచి అమలుచేయనున్న వైఎస్సార్ రైతు భరోసా పథకానికి సింహభాగం రూ.8750 కోట్లు కేటాయించారు. రైతులందరికీ వడ్డీలేని రుణాలు , వ్యవసాయ ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.3000 కోట్లతో వ్యవసాయ రంగానికి సముచిత స్థానమిచ్చారు. సాగునీటి సౌకర్యాల కల్పనకు భారీ మొత్తంలో నిధులు కేటాయించారు. మరే రాష్ట్రంలో లేనివిధంగా వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయడం చారిత్రాత్మక నిర్ణయంగా వ్యవసాయ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

వ్యవసాయ రంగ సమకాల పరిష్కారానికి స్వామినాధన్కమిషన్ సూచించిన విధంగా ధరల స్థిరీకరణ నిధి ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు చేపట్టలేదని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్రంలో ప్రతీ కుటుంబానికి జగన్ మోహన్ రెడ్డి పెద్దకొడుకుగా నిలిచారు. శ్రమించే రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రమాదబీమా అందేలా ప్రణాళికలు చేపట్టామని ముఖ్యమంత్రి  జగన్ అన్నారు. రైతు పండించిన పంట దిగుబడులు అందక నష్టాల పాలైతే ఆ పరిస్థితి నుంచి గట్టెక్కించడానికి ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించే సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: