వర్షాలు కురిసే వరుణుడు ముఖం చాటేశాడు. జలాశయాల్లో నీటిని విడుదల చేసి కాలువలకూ వదిలిపెట్టినా ఎక్కడో చివరన  ఉన్న భూములకు కాదు కాదా.. కాలువ పక్కనే ఉన్న పొలాలకూ నీరు చేరడం లేదు. ఇప్పటి వరకు కురవల్సిన వర్షపాతం కంటే 54 శాతం లోటు ఉంది. జిల్లాలో ప్రధానంగా సాగయ్యే పంట వరి. చాలినంత వర్షం కురిస్తే గాని వరి సాగయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ కరువును ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా నాలుగు అంచెల ప్రణాలికను సిద్ధం చేసింది.
 
జిల్లా వ్యాప్తంగా  సరాసరి రెండు సెంటీమీటర్ల వర్షం కురిసి ఉంటుందని అంచనా . ఈ వర్షాలు ప్రస్తుతం సాగవుతున్న పంటలకు ఊపిరి పోస్తాయని జిల్లా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో చివరి ప్రయత్నంగా రెండో పంటను నెల రోజుల పాటు ముందుకు తెచ్చేందుకు కూడా ప్రణాళికలు రచించారు.

ప్రణాళిక -1
జులై 15వ తేదీ వరకు వర్షాలు కురవకపోతే ప్రత్యామ్నాయ ప్రణాళిక-1ని అమలుచేస్తారు. ఈ మేరకు ప్రణాళిక రచించారు. జిల్లాలో ఎక్కువగా వరిని సాగుచేస్తున్న దృష్ట్యా వరిలోనే స్వల్ప కాళిక పంటలను ప్రోత్సహిస్తారు. ప్రస్తుతానికి ఈ ప్రణాలికను వాయిదా వేశారు. తాత్కాలికంగా అవసరం లేదని ప్రభుత్వానికి నివేదించారు.

ప్రణాళిక-2
జులై 30వ తేదీ వరకు కూడా అవసరమైన వర్షాలు కురవకపోతే ప్రత్యేమ్నాయ ప్రణాళిక -2ని అమలు చేస్తారు. ఈ ప్రణాళిక కింద జిల్లాలో దాదాపుగా 38 వేల హెక్టార్లకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సాధించాలని ఈ ప్రణాళికను రూపొందించారు. 38 వేల హెక్టర్లకు స్వల్పకాలిక రకాలు 1156 తరంగణి, 1121 శ్రీధృతి విత్తనాలను సరఫరా చేయాల్సి ఉంటుందని ప్రభుత్వానికి నివేదించారు.ఇందుకు 26 వేల హెక్టర్ల విత్తనాలు అవసరమవుతాయన్నారు.

ప్రణాళిక - 3
ఆగష్టు 15వ తేదీ వరకు కూడా జిల్లాలో ఇదే వర్ష భావ పరిస్థితులు కొనసాగితే ప్రత్యామ్నాయ ప్రణాళిక-3 ని అమలు చేస్తారు. ఈ ప్రణాళిక కింద జిల్లాలో 70వేల హెకోటర్లకు ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించారు. 

ప్రణాళిక -4
జిల్లాలో ఆగష్టు నెల ఆఖరు వరకూ వరి సాగు చేసుకోవడానికి జిల్లాలో పరిస్థితులు అనుకూలిస్తాయి. తరువాత పంటలు సాగు చేసిన తుఫాన్లు, భారీ వర్షాల దాటికి నీటమునిగి నాశమవుతాయి. ఈ క్రమంలో ఆగష్టు 31వ తేదీ వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే మెట్ట పంటలపైనే ద్రుష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది.  ఈ మేరకు ప్రణాలిక-4ని రూపొందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: