గతంలో తిరుపతిలో స్వామి వారిని దర్శనం చేసుకోవాలంటే సామాన్యులకు ఎన్నో ఇబ్బందులు పడేవారు.  ముఖ్యంగా ఇక్కడ సెలబ్రెటీలు, ప్రముఖ రాజకీయ నాయకులకు మాత్రం ప్రత్యేక దర్శనాలు కల్పిస్తూ ఆ సమయంలో సామాన్యులను నానా ఇబ్బందులకు గురి చేసేవారు.  ఇక్కడ మాట ఉన్నవారిదే రాజ్యం అన్న విధంగా సాగింది. ముఖ్యంగా గత ప్రభుత్వ పాలనలో చిన్న నాయకులు సైతం తిరుమలలో తమ పెత్తనాలు చెలాయించేవారని టాక్ ఉండేది.  తాజాగా ఇప్పుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత తిరుమలలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారు. 

తాజాగా  తిరుమలలో ఎల్1, ఎల్2, ఎల్3 బ్రేక్ దర్శనాలను రద్దుచేస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా స్వాగతించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ...గత ప్రభుత్వం  తిరుమలలో బ్రేక్ దర్శనాల పేరుతో తిరుమల పుణ్యక్షేత్రంలో వ్యాపారం చేశారని మండిపడ్డారు.  ఇక్కడ ప్రతి ఒక్క నాయకుడు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. 

ముఖ్యంగా తిరుమలలో ప్రత్యేక దర్శనాలు అంటూ తమ సొంత వారికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ..సామాన్య భక్తులకు ఎంతో ఇబ్బందికి గురి చేసేవారని అన్నారు.  సీఎం జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇలాంటి జులం పోయిందని సామాన్యులు సైతం స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకునే సదుపాయం చేశారని అన్నారు. అంతే కాదు బ్రెక్ దర్శనాలు కూడా చాలా వరకు తగ్గిస్తేనే బాగుంటుందని అన్నారు.  ఇక, బడ్జెట్ పైనా రోజా స్పందించారు. ఏపీ వార్షిక బడ్జెట్ లో రైతులకు, వ్యవసాయరంగానికి పెద్దపీట వేశారని కితాబిచ్చారు. రుణమాఫీ, వడ్డీలేని రుణాలు ఇవ్వడం సంతోషదాయకమని ఆమె వ్యాఖ్యానించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: