జిల్లా కలెక్టర్ కార్యాలయ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించడానికి వీల్లేదని, పనుల నిర్వహణ పక్కాగా ఉండాలని రాష్ట్ర రహదారులు, భవన నిర్మాణ శాఖా  మంత్రి ధర్మాన కృష్ణ దాస్ అధికారులకు సూసచించారు. నూతన కలెక్టర్ భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కలెక్టర్ కార్యాలయం అనేది అత్యంత కీలకమైందని, రూ.116 కోట్ల విలువతో నిర్మించాలని అంచనాలు వేయగా దీనిని రూ.165 కోట్లకు పెంచినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 40 శాతం పూర్తయినట్లు చెప్పారు. 

రూ.18 కోట్లు బిల్లులు బకాయిలు ఉన్నాయని , వాటిని వెంటనే చెల్లించేందుకు  చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పనుల నిర్వహణలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాల్సిన భాద్యత అధికాలదే అని ఆయన సూచించారు. నిర్ణీత సమయంలో నిర్మాణాలు పూర్తిచేసేందుకు పూర్తి సహాయ, సహకారాలు ఉంటాయని , పనులు వేగవంతంచేయ్యాలనీ చెప్పారు. రహదారులు , భవనాల శాఖా ఎస్ ఈ కె.కాంతి మతి , ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ గణపతి, మున్సిపల్ మాజీ చైర్మన్లు అంధవరపు వరహానరసింహం , ఎం.వి.పద్మావతి, తదితర అధికారులు నిర్మాణ పనులను పరిశీలించారు.

గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీ నుంచీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు వరకూ అంతా అవినీతికి పాల్పడ్డారని  మంత్రి  ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. అయిదేళ్ల కాలంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసారని దుయ్యబట్టారు. ఆయన పరిపాలన కాలంలో 600 హామీలు ఇచ్చారని, అయితే ఐదేళ్లలోవాటిని  పూర్తిచేయలేక పోగా... నిధులన్నింటినీ పక్క దారి పట్టించారని ఆరోపించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: