ఒకప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ తప్పించి మరొక పార్టీ ఉండేది కాదు.  ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే విషయం సాధించేది.  ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.  కాంగ్రెస్ పార్టీ దేశంలో దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది.  వరసగా ఎన్నికల్లో ఓటమి పాలవుతూ వస్తున్నది.  


ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నది.  ఎన్నికల సమయంలో భారీగా ఖర్చులు కావడం ఓటమి పాలవ్వడంతో పార్టీ దగ్గర నిధులు కరువయ్యాయి.  విరాళాలు రాకవడంతో ఇబ్బందులు పడుతున్నది.  కనీసం పార్టీ ఆఫీస్ లో పనిచేసే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి పార్టీకి ఏర్పడింది.  


స్టేట్ ఆఫీస్ లో అంటే సరే అనుకోవచ్చు..  కేంద్ర కార్యాలయంలో ఈ పరిస్థితి ఏర్పడటం నిజంగా దురదృష్టకరం అని చెప్పాలి.  ఢిల్లీలోని జాతీయ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగస్తులకు రెండు నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదట.  దీంతో ఉద్యోగస్తులు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.  


దీంతో ఉద్యోగస్తులు పార్టీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి వేరే వేరే పార్టీలలో చేరుతున్నారట.   కొందరైతే మరో కొలువు చూసుకొని బయటకు వచ్చేస్తున్నారు.  ఉద్యోగులు లేకపోవడంతో పార్టీ ఆఫీస్ పనులు పెండింగ్ లో పడుతున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: