జగన్ అధికారంలోకి వచ్చాక ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఎంత స్పీడ్ గా ఉంటున్నాయి అందరికి తెలిసిందే.  నిర్ణయాలు తీసుకుంటూ.. దూసుకుపోతున్నారు.  అన్నింటిలో జగన్ తనదైన ముద్రను వేయడానికి రెడీ అవుతున్నాడు.  


కానీ, జగన్ అన్నింటిలో నిర్ణయాలు తీసుకున్నట్టే కేంద్రానికి చెందిన కొన్నింటిలో కూడా జగన్ నిర్ణయాలు తీసుకుంటుండటంతో కేంద్రం సీరియస్ అయ్యింది.  ముఖ్యంగా విద్యుత్ విషయంలో.  పవన, సోలార్ విధ్యుత్ రంగాల్లో పీపీఏ లను పునర్పరిశీలించాలని జగన్ నిర్ణయించుకున్నాడు.  


కరెంట్ ధరకు అధికంగా ఉన్నాయని చెప్పిన జగన్, దానిపై నిర్ణయం తీసుకొని కాంట్రాక్టు ను రద్దు చేయాలని చూస్తుండటంతో కేంద్రం సీరియస్ అయ్యింది.  విధ్యుత్ విషయంలో స్వతంత్ర సంస్థ నిర్ణయం తీసుకుంటుందని, దానికి అనుగుణంగానే కరెంట్ కొనుగోలు చార్జీలు ఉంటాయని, వాటిని రద్దు చేస్తే పెట్టుబడులు వెనక్కి వెనక్కిపోతే పెట్టుబడులు ఆగిపోతాయని హెచ్చరించింది.  


కేంద్రం హెచ్చరికతో జగన్ దూకుడు తగ్గినట్టు సమాచారం.  విధ్యుత్, చమురు విషయంలో తగ్గి ఉంటేనే బెటర్ అని కొంతమంది అభిప్రాయం.  కేంద్రం హెచ్చరికతో జగన్ తగ్గటంతో బాబు సేఫ్ జోన్ లో ఉన్నారని అనుకోవచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: